OG Movie
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ ఓజీ ‘ పై భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఓజీ ఫస్ట్ గ్లిమ్స్ ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ టీం ప్రకటించింది. ఎన్నికల కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో ఓజీ విడుదల వాయిదా పడటం ఖాయం అంటున్నారు.
ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరిచి అంశమే. మేకర్స్ చెప్పిన విధంగా సెప్టెంబర్ 27 కి థియేటర్స్ లోకి రావడం అసాధ్యం అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఓజీ వాయిదాకు మరొక కారణం… పవన్ కళ్యాణ్ సన్నిహితుడు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న లక్కీ భాస్కర్ అదే తేదీన రానుంది.
లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘ లక్కీ భాస్కర్ ‘ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాబట్టి ‘ ఓజీ ‘ విడుదల వాయిదా అనివార్యమే అని చిత్ర వర్గాలు భావిస్తున్నారు. ఈ వార్త విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో నిరాశ చెందుతున్నారు. ఇటీవల డైరెక్టర్ సుజిత్ యంగ్ హీరో కార్తికేయ లేటెస్ట్ మూవీ భజే వాయువేగం ప్రమోషన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో ‘ ఓజీ ‘ చిత్రం గురించి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు.
ఇప్పటికే ప్రోమో కట్ చేశామని, షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిందని అన్నారు. చెప్పిన ప్రకారమే ఓజీ థియేటర్స్ లోకి వస్తుంది అన్నారు. ఇంతలోనే వాయిదా వార్తలు పవన్ ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. కాగా ఓజీ లో పవన్ కళ్యాణ్ కి జంటగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Web Title: Film sources feel that the postponement of og release is inevitable
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com