Photo Story: యంగ్ హీరోతో ఎఫైర్ పెట్టుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? అయ్య బాబోయ్ అప్పుడు ఇలా ఉండేదా?

బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు అరియానా గ్లోరీ. ఓ యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా అరియానా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. దీంతో దెబ్బకి అరియానా ఫేట్ మారిపోయింది. ఓవర్ నైట్ పాపులర్ అయ్యింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టింది. హౌస్ లో సత్తా చాటింది.

Written By: S Reddy, Updated On : July 9, 2024 6:28 pm

Photo Story

Follow us on

Photo Story: పైన ఫోటోలో కనిపిస్తున్న టీనేజ్ గర్ల్ చాలా క్యూట్ గా ఉంది కదా. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఈ బ్యూటీ కి మామూలు క్రేజ్ లేదు. అటు బుల్లితెర పై, ఇటు సోషల్ మీడియాలో అమ్మడు రచ్చ రచ్చ చేస్తుంది. ఒక యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తూ ఫేమస్ అయింది. బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది. ఈ రియాలిటీ షో ఆమె జీవితాన్నే మార్చేసింది. సెలెబ్రెటీ హోదా తెచ్చిపెట్టింది.

బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు అరియానా గ్లోరీ. ఓ యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా అరియానా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. దీంతో దెబ్బకి అరియానా ఫేట్ మారిపోయింది. ఓవర్ నైట్ పాపులర్ అయ్యింది. ఆ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టింది. హౌస్ లో సత్తా చాటింది.

Photo Story

ఫైర్ బ్రాండ్ లా వ్యవహరిస్తూ హౌస్ మేట్స్ కి చుక్కలు చూపించింది. బిగ్ బాస్ షో ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్. బిగ్ బాస్ బజ్ సీజన్ 5 కి హోస్ట్ గా వ్యవహరించింది. బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 1 లో కూడా అరియానా పార్టిసిపేట్ చేయడం విశేషం. ఆ తర్వాత పలు బుల్లితెర షోలలో అరియానాకు ఆఫర్లు వచ్చాయి. రెండు మూడు సినిమాల్లో కూడా మెరిసింది. ‘ బీబీ జోడి ‘ లో అవినాష్ తో కలిసి డాన్స్ చేసింది.

తనలోని మరో టాలెంట్ ని బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అరియానా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తుంది. హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. అరియానా లేటెస్ట్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అరియానా అసలు పేరు మంగలి అర్చన. తాజాగా అరియనా సీరియస్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. హీరో రాజ్ తరుణ్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుందని అతని మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించింది. ఈ అలిగేషన్స్ పై అరియనా స్పందించకపోవడం విశేషం.