Shiva Movie Child Artist: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన చిత్రాల్లో ఒకటి ‘శివ'(Shiva Movie). ఈ చిత్రం కేవలం నాగార్జున కెరీర్ ని మాత్రమే కాదు, తెలుగు సినిమా రూపు రేఖలను మార్చేసింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, ఆరోజుల్లోనే ఈ చిత్రం తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఆ రెండు భాషల్లో కూడా ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిల్చింది. ఇంకా ఎంత కాలం ఒకే మూస సినిమాలు తీస్తూ కూర్చుంటారు,కాస్త మేకింగ్ స్టైల్ మార్చండి,కొత్తగా ఐడియాలతో సినిమాలు తీయండి అంటూ, ఆరోజుల్లో ఇండియన్ ఫిలిం మేకర్స్ మైండ్ సెట్ మార్చేసిన చిత్రమిది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని ఈ నెల 14 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కోసం 4K టెక్నలాజి కి అప్డేట్ చేసి, డాళ్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్ తో ఒక కొత్త సినిమాని చూసేటప్పుడు కలిగే అనుభూతిని రప్పించే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి, నాగార్జున కొత్త సినిమాకు కూడా జరగనంత అడ్వాన్స్ బుకింగ్స్ ఈ సినిమా కోసం జరుగుతున్నాయి. చూస్తుంటే సీనియర్ హీరోల క్యాటగిరీ లో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో ఒక ఛేజింగ్ ఉంటుంది, అందులో నాగార్జున తో పాటు చిన్న పాప కూడా ఉంటుంది గుర్తుందా?. ఈ పాప గురించి రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా నిన్న ప్రత్యేకించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘అమ్మా సుష్మ..నువ్వు ఈ సినిమాలో చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. ఆరోజుల్లో ఆ రిస్కీ షాట్ లో నువ్వెంత భయపడ్డావో నాకు తెలియదు కానీ, అప్పట్లో నిన్ను బాధపెట్టినందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు’ అంటూ ఆమె ఫోటో ని షేర్ చేస్తూ ఒక పోస్ట్ వేసాడు.

ప్రస్తుతం సుష్మ USA లో AI , కాగ్నిటివ్ సైన్స్ లో రీ సెర్చ్ చేస్తుందట. సినిమాలకు ఆమెకు ప్రస్తుతం అసలు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక శివ సినిమాలో సుష్మ నాగార్జున అన్నయ్య కూతురుగా నటించింది. ఆమెని నాగార్జున హాస్పిటల్ లో సైకిల్ మీద తీసుకెళ్తుండగా, విలన్ గ్యాంగ్ నాగార్జున ని ఛేజ్ చేస్తూ ఉంటుంది. ఈ సీక్వెన్స్ ని మామూలుగా డూప్స్ తో కానిచేస్తారు. కానీ నాగార్జున ఈ సీక్వెన్స్ ని రియల్ గా చేసాడట. ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జునే రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు.