Chiranjeevi 10th class certificate: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జీవితం గురించి తెలియని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. కానీ కొన్ని విషయాలు మాత్రం అభిమానులకు తెలియవు. చిన్న తనం లో చిరంజీవి ఒక మంచి విద్యార్థి అట. స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఆయన టాప్ మార్కులు పొందే ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ లో ఒకరిగా ఉండేవాడట. ఒకవేళ చిరంజీవి సినిమాల్లోకి రాకపోయుంటే ఏమి అయ్యేవాడు అని ఆయన సోదరుడు నాగబాబు ని ఒక ఇంటర్వ్యూ లో అడగ్గా, మా అన్నయ్య మంచి స్టూడెంట్, ఒకవేళ సినిమాలు లేకపోతే IAS చదివి కలెక్టర్ అయ్యేవాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే చిరంజీవి 10 వ తరగతి కి సంబంధించిన మార్కుల లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఈ మార్కుల లిస్ట్ లో శివ శంకర వరప్రసాద్ అనే పేరు ఉండడం మనం గమనించొచ్చు.

మార్కులు స్పష్టంగా ఇందులో కనిపించడం లేదు కానీ, మెగా ఫ్యాన్స్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఆరోజుల్లోనే మెగాస్టార్ ఫస్ట్ క్లాస్ లో 10 వ తరగతి పాస్ అయ్యాడట. చాలా అరుదుగా ఇలాంటివి అప్పట్లో జరుగుతూ ఉండేవి. మంచి మార్కులు వచ్చే విద్యార్థులను అప్పట్లో చాలా గొప్పగా చూసేవారట. ఇక సినీ రంగం లోకి వచ్చిన తర్వాత మెగాస్టార్ గా ఆయన ఎదిగిన తీరు కోట్లాది మంది యువకులకు ఆదర్శప్రాయం. కష్టపడే తత్త్వం, టాలెంట్ ఉంటే ఏ రంగం లో అయినా రాణించవచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 7 పదుల వయస్సు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇప్పటి తరం కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ, వాళ్ళతో సమానంగా రికార్డ్స్ ని కూడా కొల్లగొడుతున్నాడంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న కామెడీ జానర్ చిత్రమిది. నయనతార ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.