Star Hero criticized Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు కారణం ఏంటి అంటే వాళ్ళు చేసే సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. వాళ్ల నుంచి వచ్చే సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటు ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇవ్వగలిగే హీరోలు కొంతమంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్న నేపథ్యంలో ఇకమీదట రాబోయే సినిమాల విషయంలో మన హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక విక్టరీ వెంకటేష్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. శోభన్ బాబు తర్వాత ఆ ఘనతను అందుకున్న హీరో కూడా తనే కావడం విశేషం. వెంకటేష్ నుంచి ఒక సెంటిమెంటల్ సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులందరు థియేటర్ కి వచ్చి సినిమాను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
అలాంటి ఒక చరిష్మా ఉన్న వెంకటేష్ ఒక సినిమా విషయంలో చాలావరకు పొరపాటు చేశారనే చెప్పాలి… ఎస్ వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో అలీ హీరోగా వచ్చిన యమలీల సినిమా తెలుగులో సూపర్ సూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాని వెంకటేష్ బాలీవుడ్ లో ‘తక్ ధీర్ వాలా’ అనే సినిమా పేరుతో రీమేక్ చేశాడు. కానీ ఈ సినిమా అక్కడ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
ఇక వెంకటేష్ సైతం ఆ సినిమాకు సెట్ అవ్వలేదంటూ భారీ విమర్శలైతే వచ్చాయి. ఈ మూవీని చూసిన మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ తో నీకు ఇలాంటి సినిమాలు సెట్ అవ్వవు అని చెప్పారట. మొత్తానికైతే వెంకటేష్ తన పంథాను మార్చుకొని చేసిన సినిమా కావడం, అలాగే అంత చిన్న స్టోరీ వెంకటేష్ ఇమేజ్ కి సెట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది.
ఇక ఇప్పుడు వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆదరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సంవత్సర సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమా మీద ఆయన భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు…