Tollywood
Tollywood: ఫేవరేట్ హీరో సినిమా వస్తుందంటే పండగలా అనిపిస్తుంది ఫ్యాన్స్ కు. వారి సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తూ ఉంటారు. మరి స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలానే సిద్దంగా ఉన్నాయి. మరి ఈ సినిమాల పరిస్థితి ఏంటి? షూటింగ్ జరుగుతుందా? ఎక్కడ జరుగుతున్నాయి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
ప్రభాస్: కల్కి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ ట్రాక్ తో దూసుకొని వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరో వైపు షూటింగ్ లకు హాజరు అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా స్టార్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ సినిమా రాజాసాబ్. ఈ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతోందని సమాచారం.
చిరంజీవి: వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ఈ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని టాక్.
అల్లు అర్జున్, రవితేజ: మాస్ రాజా మహారాజా మిస్టర్ బచ్చన్ షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లారు. ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అంతేకాదు పాటలు కూడా ప్లాన్ చేశారట. మరో వైపు రామోజీ ఫిలిం సిటీలో పుష్ప సినిమా షూటింగ్ లో బీజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మెగా హీరోలు: సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా తమ సినిమాలతో సెట్స లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు రోహిత్ డైరెక్షన్లో తేజ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. వరుణ్ మట్కా సినిమా షూటింగ్ మోయినాబాద్లో జరుగుతుంది.
బాలకృష్ణ: ఎన్నికల బీజీ పూర్తి అవడంతో సినిమాల మీద ఫోకస్ చేశారు బాలయ్య. ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ఎన్బీకే 109 కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కతున్న లక్కీ భాస్కర్ సినిమా కూడా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది.