Sundarakanda: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు గా సక్సెస్ అవ్వాలనే కోరికతో చాలా మంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ వాళ్ళ లక్కు ను పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. మిగతా వాళ్లంతా సక్సెస్ లు లేక ఫేడౌట్ అయిపోతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమం లోనే ఒక హీరోయిన్ మాత్రం సక్సెస్ ఫుల్ సినిమాలో నటించిన కూడా ఆ తర్వాత మరే సినిమాలో నటించకపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఆ హీరోయిన్ ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం.
వెంకటేష్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992 వ సంవత్సరం లో వచ్చిన ‘సుందరకాండ ‘ సినిమా మనందరికీ చాలా ఇష్టమైన సినిమా… ఈ సినిమాలో వెంకటేష్ నటన గాని, రాఘవేంద్రరావు మేకింగ్ గాని చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మీనా నటించగా, ఒక అల్లరి అమ్మాయి పాత్రలో ‘అపర్ణ ‘ నటించింది. సినిమా కథ ప్రకారం వెంకటేష్ స్కూల్ టీచరుగా నటిస్తే, తన స్టూడెంట్ గా నటించిన అపర్ణ వెంకటేష్ ను ఎప్పుడు టీజ్ చేస్తూ ఉంటుంది. ఇక తన టార్చర్ భరించలేక వెంకటేష్ మీనా ను పెళ్లి చేసుకుంటాడు. ఇక ఇలాంటి క్రమం లో ఈ సినిమా మొత్తం తను అల్లరి పిల్లలాగా నటించి చివరిలో మాత్రం ఏడిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు అయిన రాఘవేంద్రరావు మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక కొత్త అమ్మాయిని తీసుకోవాలని అనుకున్నడట..
కె వి సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అపర్ణని చూశారట. తను ఆ పాత్రకి బాగా సెట్ అవుతుంది అని అనుకున్నాడు. కానీ ఆమెను ధైర్యం చేసి సినిమాలో చేస్తానని అడగలేక పోయాడు. ఎందుకంటే అప్పట్లో ఉన్న చాలా మందికి సినిమా ఇండస్ట్రీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేది. అందుకే సినిమాల్లోకి రావడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇక మొత్తానికైతే అక్కడ అమ్మాయి మిస్సయింది. ఇక ఈ క్యారెక్టర్ కోసం అడిషన్స్ చేస్తున్న నేపథ్యంలో ఆ అమ్మాయి ఆ సినిమా ఆడిషన్ కి రావడం రాఘవేంద్రరావు వెంటనే అమ్మాయిని క్యారెక్టర్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో అపర్ణ ఆ పాత్రలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అపర్ణ వాళ్ళ పేరెంట్స్ కి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం లేకపోవడంతో తను చదువుల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రస్తుతానికి అమెరికాలో సెటిలైంది.
అయితే సుందరకాండ సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారి అపర్ణ అభిమానులు తన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఆమె ఏం చేస్తుంది అనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అయితే ఆమె అమెరికాలో సెటప్ అయింది.ఇక తనకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అవుతున్నాయి… ఇక ఆమె అభిమానులు తనని మరొకసారి స్క్రీన్ మీద చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు…