Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?

Pawan Kalyan: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఎన్నికల కోసం బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు ఉండటంతో తన చేతిలో ఉన్న మూడు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చారు. అందులో హరిహర వీరమల్లు ఒకటి. దీన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. గతంలోనే మొదలైన ఈ సినిమా భారీ ఫైట్స్ తో రూపొందుతుంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా పొందారట.

హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా షూటింగ్ దశలో నిలిచిపోయింది. ఈ రెండు మాత్రమే కాదు ఓజీ సినిమా కూడా మధ్యలోనే ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మరి పవర్ స్టార్ ఇంత బిజీగా ఉంటూ తన డైట్ ను ఎలా ఫాలో అవుతున్నారు అనే టెన్షన్ అభిమానుల్లో ఉంటుంది. ఇంతకీ ఆయనకు ఇష్టం ఉండే ఫుడ్ ఏంటో తెలుసా? మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా ఇష్టమట. అంతేకాదు సీ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టమట.

ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు, నాటుకోడి చికెన్, పులిహోర అంటే పవర్ స్టార్ కు చాలా ఇష్టమట. ఒకసారి ఈ విషయాల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య కూడా వివరించారు. ఎవరికీ పుస్తకాలు ఇవ్వని త్రివిక్రమ్ పవన్ కు మాత్రం తన పుస్తకాలు ఇస్తారని చెప్పింది. అంతేకాదు ఆయనకు వెజిటేరియన్ ఆహారాలు అంటే ఇష్టం అని.. ఉప్మాతో పాటు రవ్వ లడ్డూ వంటి స్వీట్లు కూడా ఇష్టం అని తెలిపింది. త్రివిక్రమ్ వారి ఇంట్లో పవన్ కళ్యాణ్ కు ఏదైనా తినే స్వేచ్ఛ ఉందట. అదే విధంగా పవన్ కూడా మొహమాట పడరట.

పవన్ కళ్యాణ్ కు హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టం అని రామ్ చరణ్ కూడా ఓ సందర్భంగా తెలిపారు. కానీ సినిమాలు చేస్తున్నప్పుడు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తుంటారట. బ్రో సినిమా చేస్తున్నప్పుడు కేవలం శాఖాహారం మాత్రమే తీసుకున్నారట. కేవలం పాలు, కూరగాయలు మాత్రమే తీసుకున్నారట. వకీల్ సాబ్ సమయంలో కూడా ఓ ప్రత్యేకమైన డైట్ ను ఫాలో అయ్యారట. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ఫిట్ నెస్ కోసం ప్రత్యేకమైన ఆహారం మాత్రమే తీసుకుంటారట పవన్ కళ్యాణ్.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version