RGV: వర్మ పిచ్చి సినిమాలు తీయడానికి కారణం ఏంటో తెలుసా..?

శివ, కంపెనీ, సత్య, సర్కార్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ లని అందించిన వర్మ ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అని చాలామంది చాలా రకాలుగా వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Written By: Gopi, Updated On : March 8, 2024 3:31 pm

RGV makes the worst movies

Follow us on

RGV: ఒకప్పుడు ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పిచ్చి సినిమాలు చేస్తూ ఇక మీదట తను చేసే సినిమాలు అన్ని ఇవే అనేలా తనను తాను కొత్తగా పోట్రే చేసుకుంటున్నాడు. దానివల్ల తనకి పబ్లిసిటీ అయితే పెరుగుతుంది. కానీ ఆయన సినిమాలను పట్టించుకునే ఆడియన్స్ మాత్రం లేకుండా పోతున్నారు. ఇక దీనివల్లే రామ్ గోపాల్ వర్మ కెరియర్ అనేది చాలా ఢీలా పడిపోయింది. ఒకప్పుడు శివ, కంపెనీ, సత్య, సర్కార్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ లని అందించిన వర్మ ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అని చాలామంది చాలా రకాలుగా వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇక ఆయన అలాంటి సినిమాలు తీయడానికి సరైన కారణం ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కెరియర్ మొదట్లో జనాలని ఆకర్షించాలని, జనం దృష్టిలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాలని, దాని ద్వారా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకొని, తద్వారా సక్సెస్ లను సాధించి డబ్బులని కూడా ఎక్కువ సంపాదించాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మకి డబ్బుంది.

అలాగే తను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు అందువల్లే సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా తనకు నచ్చిన సినిమాలను తీస్తూ జనాల మీదకు వదులుతున్నాడు. ఇది చూస్తున్న కొంతమంది వర్మకి పిచ్చి పట్టింది అని అంటుంటే, మరికొందరు మాత్రం వర్మ ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటున్నారు. మొత్తానికైతే వర్మ ఏదో ఒక రకంగా జనాల్లో తన పేరుని వినిపించేలా చేసుకుంటూన్నాడు. ఇక రోజూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని ఎప్పుడూ టీవీ చానెల్ కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తు ఉంటాడు.

దీనివల్ల ఆయనకు ఫ్రీ పబ్లిసిటీ రావడమే కాకుండా పది సినిమాలు చేసిన రానంత గుర్తింపు వర్మకి ఇలాంటి కామెంట్స్ తో వస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు పొలిటికల్ గా కొంతమంది మీద సెటైరికల్ గా కూడా పంచులు వేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో పొలిటికల్ అంశాల మీద సినిమాలను చేస్తు రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇక వర్మ ఏది చేసినా కూడా జనాలు ఆయనను పట్టించుకోవడం మాత్రం మానేశారు…