Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందడమే కాకుండా పాన్ ఇండియాలో అడుగుపెట్టిన మొదటి సౌత్ ఇండియా డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ఈయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా కోసమే విపరీతమైన కసరత్తులను చేస్తున్న రాజమౌళి, ఈ సినిమాతో ఎలాగైనా సరే మరో బ్లాక్ బాస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడట. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈయన, ఈ సినిమాతో దాదాపు రెండు నుంచి మూడు ఆస్కార్ అవార్డు లను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఎప్పుడు యాక్షన్ సినిమాలనే చేస్తుంటాడు. అందులోనూ ఆయనకి హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం అంటేనే చాలా ఇష్టం. అయితే రాజమౌళి కి ఇలాంటి ఇష్టం ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే ఆయన చూసిన సీనియర్ ఎన్టీఆర్ సినిమానే అని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. రాజమౌళి సినిమాలకి సీనియర్ ఎన్టీయార్ సినిమాలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మొత్తం చదవండి మీకే అర్థం అవుతుంది.. రాజమౌళి చిన్నతనం లో ఉన్నప్పుడు వీళ్లంతా ఉమ్మడి కుటుంబంగా ఉండేవారట. ఇక ఇంట్లో దాదాపు 13 మంది వరకు పిల్లలు ఉండేవారట. అయితే బేసిగ్గా రాజమౌళి వాళ్ళది సినిమా ఫ్యామిలీ కాబట్టి, ఎక్కువ సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించేవారట. ఇక అందులో భాగంగానే పెద్దవాళ్ళు అయితే వారానికి ఒక సినిమా, చిన్న వాళ్ళైతే నెలకు ఒక సినిమా చూడాలనే కాన్సెప్ట్ తో వాళ్లు సినిమాలను చూసేవారట.
ఇక ఈ క్రమంలోనే రాజమౌళి తో ఉన్న మిగతా పిల్లలందరూ నెక్స్ట్ వాళ్ళు చూడబోయే సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారట. ఇక రాజమౌళి వాళ్ళ ఊర్లో రెండు థియేటర్లు మాత్రమే ఉండేవట. ఒకానొక సందర్భంలో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన “అగ్గి రాముడు”, “మంచి చెడు ” రెండు సినిమాలు రెండు థియేటర్లలో ఆడుతున్నాయట. దాంతో రాజమౌళి వాళ్ళ ఇంట్లో పెద్దలు అగ్గి రాముడు సినిమా బాగుందట. అందులో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయట అని మాట్లాడుకునేవారట. మంచి చెడు సినిమా కూడా బాగానే ఉంది. కానీ అగ్గి రాముడు అంత యాక్షన్ ఎపిసోడ్స్ లేవని వాళ్ళు మాట్లాడుకుంటుంటే రాజమౌళి విన్నాడట. ఇక దాంతో వాళ్ళ పిల్ల బ్యాచ్ తో మనం ఈ వారం అగ్గి రాముడు సినిమా చూడబోతున్నామని చెప్పారట. దానికి తగ్గట్టుగానే అందరూ ఆ సినిమా చూడడానికి ఫిక్స్ అయిపోయారు.
కానీ సినిమాకి వెళ్ళే సమయంలో ఇంట్లో ఉన్న పెద్దలు అగ్గి రాముడు కంటే మంచి చెడు బాగుందంట దాంట్లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయట అని రాజమౌళికి చెప్పి అతన్ని ఒప్పించి మరి ఆ సినిమాకి తీసుకెళ్లారట. తీరా మంచి చెడు సినిమాకి వెళ్తే అందులో ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా లేకపోగా, ఆ సినిమాను చూస్తున్నంత సేపు రాజమౌళికి చిరాకు పుట్టిందట. ఇక దానికి తోడుగా చివర్లో హీరో చనిపోవడం అనేది రాజమౌళికి అస్సలు నచ్చలేదట. ఇక అప్పుడే రాజమౌళి ఒకటి ఫిక్స్ అయ్యాడట..అదేంటంటే “నేను కనక సినిమా చేసినట్లయితే ఇలాంటి సాడ్ ఎండింగ్ ఉన్న సినిమాను చేయకూడదు. అలాగే సినిమా మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేయాలని అప్పుడే ప్లాన్ చేసుకున్నాడట”. అలా రాజమౌళి యాక్షన్ సినిమాలు మాత్రమే తీయడానికి సీనియర్ ఎన్టీఆర్ సినిమా కారణం అయిందనే చెప్పాలి…