‘మజిలీ’లో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడెలా ఉందో తెలుసా?

2019లో వచ్చిన మజిలీ మూవీ కోసం కేవలం రూ.20 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ మూవీ క్లాసికల్ హిట్టుగా నిలిచి రూ. 70 కోట్లు వసూలు చేసింది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్టు హిట్టు అని సినీ వర్గాల్లో చర్చ సాగింది.

Written By: Chai Muchhata, Updated On : June 19, 2024 1:09 pm

Magili Ananya Agarwal

Follow us on

సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరిలో కొందరు స్టార్లు కాగా.. మిగతా వారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. అక్కినేని నాగచైతన్య నటించిన ‘మజిలీ’ మూవీ గురించి సినిమా ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. ఇందులో నటించిన వారికి గుర్తింపు వచ్చింది. నాగచైతన్య, సమంత నటించిన ఇందులో ఓ అమ్మాయి నటించింది. ఆమె సినిమాకు కీ రోల్ గా ఉంటుంది. అయితే ఆమె ఇప్పుడు పెరిగి పెద్దయి హీరోయిన్ లెవల్లో మారిపోయింది. ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె గురించి తీవ్ర చర్చనీయాంశగా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

2019లో వచ్చిన మజిలీ మూవీ కోసం కేవలం రూ.20 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ మూవీ క్లాసికల్ హిట్టుగా నిలిచి రూ. 70 కోట్లు వసూలు చేసింది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్టు హిట్టు అని సినీ వర్గాల్లో చర్చ సాగింది. ఇందులోని సాంగ్స్ సూపర్ డూపర్ గా హిట్టయ్యాయి. నాగచైతన్, సమంతలు కలిసి నటించిన ఇందులో మీరా పాత్రలో ఓ అమ్మాయి నటించింది. ఈమె సినిమాకు కీ రోల్ గా నిలుస్తుంది. ఈమె ఎవరో తెలుసా?

మీరా పాత్రలో నటించిన అమ్మాయి పేరు అనన్య అగర్వాల్. ఈమె 2004లో ముంబైలో జన్మించింది. ముందుగా టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఆ తరువాత యాడ్స్ లో నటించింది. హిందీలో ఆమె ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్, క్యా హువా తేరా వాద, సియా కే రామ్, మహా భారత్ వంటి సీరియళ్లలో నటించింది. ఆ తరువాత పలు ప్రకటనల ద్వారా గుర్తింపు సాధించింది. అయితే ఆమె వెండి తెరపై ‘మజిలీ’ సినిమాతోనే కనిపించింది.

ఈ సినిమాలో నటించిన తరువాత అనన్య మరోసారి వెండి తెరపై కనిపించలేదు. కానీ సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమెుకు సంబంధించిన లేటేస్ట్ పిక్స్ అలరిస్తున్నాయి. అయితే సినిమా అవకాశాలు రానట్లే తెలుస్తోంది. అయితే ఈ అమ్మడుకు సినిమాల్లో నటించాలని ఉందా? లేదా? అనే విషయం మాత్రం బయటపెట్టడం లేదు.