Rajinikanth Remuneration: దేశంలోనే అత్యధికం… లోకేష్ కనకరాజ్ మూవీకి రజినీకాంత్ రెమ్యునరేషన్ తెలుసా?

జైలర్ విజయంతో ఊపుమీదున్న రజినీకాంత్ వరుసగా రెండు చిత్రాలు ప్రకటించారు. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ మూవీ చేస్తున్నాడు.

Written By: S Reddy, Updated On : April 24, 2024 10:21 am

Rajinikanth Remuneration

Follow us on

Rajinikanth Remuneration: హీరో రజినీకాంత్ రెమ్యునరేషన్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఏకంగా ప్రభాస్ ని దాటేసిన ఆయన రెడింతలు ఎక్కువ తీసుకుంటున్నారట. 73 ఏళ్ల రజినీకాంత్ వరుస చిత్రాలు ప్రకటిస్తున్నారు. గత ఏడాది ఆయన నటించిన జైలర్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. జైలర్ వరల్డ్ వైడ్ రూ. 650 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో రజినీకాంత్ నటించిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు జైలర్ రాబట్టింది. మలయాళ, కన్నడ పరిశ్రమలకు చెందిన సూపర్ స్టార్స్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు.

జైలర్ విజయంతో ఊపుమీదున్న రజినీకాంత్ వరుసగా రెండు చిత్రాలు ప్రకటించారు. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టైయాన్ మూవీ చేస్తున్నాడు. వెట్టైయాన్ మూవీ దీపావళి కానుకగా విడుదల కానుందని సమాచారం. కాగా రజినీకాంత్ తన 171వ చిత్రం లోకేష్ కనకరాజ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్ర టైటిల్ టీజర్ విడుదల చేశారు.

గోల్డ్ మాఫియా అడ్డాలోకి వెళ్లిన రజినీకాంత్ వాళ్ళను ఇరగొట్టాడు. ఆయన డైలాగ్స్ గూస్ బంప్స్ రేపుతున్నాయి. ఇక లోకేష్ కనకరాజ్-రజినీకాంత్ చిత్రానికి కూలీ అనే టైటిల్ నిర్ణయించారు. మాస్ అప్పీల్ తోకూడిన ఈ టైటిల్ రజినీకాంత్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఇక టీజర్ అంచనాలు తారా స్థాయికి చేర్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి రజినీకాంత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

కూలీ చిత్రానికి గాను రజినీకాంత్ ఏకంగా రూ. 280 కోట్లు తీసుకుంటున్నాడట. ఇది దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు. ఈ స్థాయిలో మరొక హీరో తీసుకోవడం లేదు. ప్రభాస్ మాత్రమే రూ. 150 కోట్ల వరకు తీసుకుంటున్నారు. కానీ రజినీకాంత్ అంతకు రెండు రెట్లు పారితోషికం తీసుకుంటూ రికార్డులకు ఎక్కాడు. అది ఆయన రేంజ్ అని చెప్పొచ్చు. ఆయనతో పాటు స్టార్స్ గా వెలిగిన చాలా మంది హీరోలు ఫేడ్ అవుట్ అయ్యారు. రజినీకాంత్ మాత్రం ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు.