https://oktelugu.com/

Vijay Devarakonda: కెరియర్ మొదట్లో విజయ్ దేవరకొండ ను పట్టించుకోని ఆ డైరెక్టర్ తో ఇప్పుడు సినిమా చేస్తాడా..?

Vijay Devarakonda: ప్రస్తుతం విజయ్ దేవరకొండ కి వరుసగా ప్లాప్ లు వస్తున్నప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం ఆయన క్రేజ్ తగ్గడం లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూసిన ఆయన నానితో పాటు పోటీ పడుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 4, 2024 / 05:21 PM IST

    Director Sekhar Kammula to team up with Vijay Devarakonda

    Follow us on

    Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలామంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అందులో కొంతమంది సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్ గా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన హీరోల్లో నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలను మినహాయిస్తే ఏ హీరో కూడా అంత పెద్దగా సక్సెస్ లను అయితే సాధించలేకపోతున్నారు.

    మరి వీళ్ళు సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చిరంజీవి రవితేజలా తర్వాత వాళ్ళంతటి మంచి పేరును సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కి వరుసగా ప్లాప్ లు వస్తున్నప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం ఆయన క్రేజ్ తగ్గడం లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూసిన ఆయన నానితో పాటు పోటీ పడుతున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే నాని లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో ఉండటం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి…అలాంటి నాని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తన కెరియర్ స్టార్టింగ్ లో ఒక దర్శకుడితో సినిమా చేయాలని చాలా వరకు ప్రయత్నం చేశాడు. కానీ ఆ దర్శకుడు విజయ్ కి పెద్దగా అవకాశం అయితే ఇవ్వలేదు. ఇక ఆ దర్శకుడు ఇప్పుడు విజయ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నప్పటికి విజయ్ మాత్రం ఆయనకి అవకాశం ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆ డైరెక్టర్ ఎవరు అంటే శేఖర్ కమ్ముల… ఈయన తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ కోసం పోటీపడిన విజయ్ దేవరకొండ ను పక్కనపెట్టి డైరెక్టర్ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు.

    ఇక విజయ్ మాత్రం శేఖర్ కమ్ములతో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆయన ఆ సినిమాలో తన పాత్రని చిన్నగా చేసి చూపించడంతో శేఖర్ కమ్ముల మీద ఆయనకు అప్పట్లో విపరీతమైన కోపం వచ్చిందట. ఇక అందుకే ఆయన దర్శకత్వంలో సినిమా చేయకూడదనే ఉద్దేశ్యం తో వేరే వాళ్ళతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…