Viral Video: ఎగిరే విమానంలో ఏంటి ఆంటీ ఇదీ.. మరీ ఇంతలానా?

ఇటీవల ఇండిగో విమానంలో ఓ మహిళ ప్రయాణించింది. అయితే విమానంలో ఆమె అందరు ప్రయాణికుల్లా సీట్లో కూర్చోలేదు. విమానం గాలిలో ఉన్నప్పుడే తన ఇన్‌స్టాగ్రామ్‌ కోసం ఓ వీడియో చేసింది.

Written By: Raj Shekar, Updated On : July 4, 2024 5:18 pm

Viral Video

Follow us on

Viral Video: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా మంది ఓ పనిగా పెట్టుకుంటున్నారు. రీల్స్‌ చేయకపోతే వారికి రోజు గడవదు. లోకేషన్‌తో సంబంధం లేకుండా.. అందరూ చూస్తున్నా సిగ్గు పడకుండా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. ఇంతలా రీల్స్‌ అంటే మోజు చూపుతున్నారు. ఇక అమ్మాయిలు, ఆంటీలైతే మరీ ఎక్కువ. అయితే రీల్స్‌ చేయడం తప్పు కాదు. కానీ, కొందరు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో రీల్స్‌ చేస్తూ.. ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. తమ కారణంగా ఇతరులు ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఆంటీ కూడా రీల్స్‌ కోసం హద్దు మీరింది.

ఏం జరిగిందంటే..
ఇటీవల ఇండిగో విమానంలో ఓ మహిళ ప్రయాణించింది. అయితే విమానంలో ఆమె అందరు ప్రయాణికుల్లా సీట్లో కూర్చోలేదు. విమానం గాలిలో ఉన్నప్పుడే తన ఇన్‌స్టాగ్రామ్‌ కోసం ఓ వీడియో చేసింది. అటూ ఇటూ ప్రయాణికులు సీట్లో కూర్చున్నప్పటికీ వారి మధ్యలో స్టైల్‌ స్టైల్‌ అనే పాటకు స్టెప్పులేసింది. ఈ వీడియోను ‘సల్మా షేక్‌’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలో పోస్టు చేసింది.

నెట్టింట్లో వైరల్‌..
విమానంలో ఆటీ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆంటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నాన్సెన్స్‌ చేయడానికి అదేమైనా ఆమె ప్రైవేటు విమానమా అని ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ఇలా డ్యాన్సులు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్‌ అయితే ‘ఇదొక చెత్త వీడియో. తను నలుగురి మధ్య ఈ వీడియో చేసిందని అభినందించాలా? లేకపోతే తాను ఎంపిక చేసిన చెత్త రీల్‌పై సెటైర్‌ వేయాలా?’ అని రాసుకొచ్చాడు. మరొకరు ‘ఇదేం నీ ఇల్లు కాదు, ఇలాంటి న్యూసెన్స్‌ ఆపండి’ అని ఫైర్‌ అయ్యాడు. ‘ఇన్నాళ్లూ ట్రాఫిక్‌ సిగ్నల్స్, రైళ్లలో మాత్రమే ఇటువంటి చెత్త చూసేవాడిని, ఇప్పుడు ఇది విమానాల దాకా చేరిందా?’ అంటూ ఇంకో నెటిజన్‌ కామెంట్‌ చేవాడు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు కోరారు.