Homeజాతీయ వార్తలుVivekananda Death Anniversary: వివేకానంద వర్ధంతి: వివేకానందుడు ప్రపంచానికి ఆదర్శం

Vivekananda Death Anniversary: వివేకానంద వర్ధంతి: వివేకానందుడు ప్రపంచానికి ఆదర్శం

Vivekananda Death Anniversary: భారతదేశం ప్రతి సంవత్సరం జూలై 4న స్వామి వివేకానంద వర్ధంతిని నిర్వహిస్తుంది. 1863, జనవరి 12న జన్మించిన ఆయన భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, మేధావి. నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఆయన భారతీయ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు. పాశ్చాత్య దేశాలకు యోగా, వేదాంతాలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. వివేకానందుడు ఆధునిక భారతీయ జాతీయవాద పితామహుడిగా పరిగణించబడతాడు. 19వ శతాబ్దం చివరలో హిందూ మతాన్ని ఒక ప్రధాన ప్రపంచ మతం స్థాయికి తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.

1893, సెప్టెంబర్ 11న చికాగోలోని ప్రపంచ సర్వమత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన ప్రసంగం ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. అంతర్జాతీయ వేదికలపై హిందూమతంపై అవగాహన కల్పించిన ఘనత ఆయనదే. ఆయనకు సైన్స్, మతంపై విషయంలో తేడా.. అపారమైన పరిజ్ఞానం ఉంది.

వివేకానందుడు బాల్యం నుంచే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. అతను హిందూ దేవతల విగ్రహాల ఎదుట ధ్యానం చేసేవాడు. అన్ని మత, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపేవారు. రాజస్థాన్ లోని ఖేత్రి అనే చిన్న రాష్ట్రాన్ని పరిపాలించిన మహారాజా అజిత్ సింగ్ సూచన మేరకు వివేకానందుని గుర్తింపు దక్కించుకున్నాడు.

స్వామి వివేకానంద మరణం
స్వామి వివేకానంద 1902, జూలై 4న ధ్యానం చేస్తూ కన్నుమూశారు. మెదడులోని రక్తనాళాలు పగిలిపోవడంతో ఆయన మహాసమాధిని పొందారని ఆయన శిష్యులు చెప్తుంటారు. తాను 40 ఏళ్లు కూడా బతకలేనని వివేకానందుడు ముందే ఊహించాడు. 16 సంవత్సరాల క్రితం తన గురువు రామకృష్ణ పరమహంస దహన సంస్కారాలు జరిగిన బేలూరులోని గంగా నది ఒడ్డున ఆయన అంత్యక్రియలు నిర్వహించారు శిష్యులు.

స్వామి వివేకానందకు నివాళి
స్వామి వివేకానందకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ‘స్వామి వివేకానంద పుణ్య తిథి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయన బోధనలు లక్షలాది మందికి బలాన్నిస్తాయి. ఆయన లోతైన వివేకం, అలుపెరగని జ్ఞానాన్వేషణ ఎంతో స్ఫూర్తి దాయకం. సుసంపన్నమైన, ప్రగతిశీల సమాజం కోసం ఆయన కన్న కలను సాకారం చేయడానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం.’ అని అన్నారు.

‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా వివేకానందకు నివాళులుర్పించారు, ‘ఈ రోజు స్వామి వివేకానంద వర్ధంతి. ఆయనను స్మరించుకుంటున్నాను. మతవిద్వేషాలు, విభేదాలు లేకుండా మన మతాన్ని, దేశాన్ని ప్రేమించడం నేర్పిన గొప్ప సన్యాసి, దేశభక్తుడికి ఇవే నా నివాళులు.’ అన్నారు.

స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్
* లేవండి, మేల్కొండి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించవద్దు.’
* జీవితంలో రిస్క్ తీసుకోండి. గెలిస్తే నాయకత్వం వహించొచ్చు. ఓడిపోతే మీరు నేర్చుకోగలరు.
* నువ్వు లోపలి నుంచి ఎదగాలి. ఎవరూ నీకు బోధించలేరు, ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తయరు చేయలేరు. నీ ఆత్మ తప్ప మరో గురువు లేడు.
* మిమ్మల్ని మీరు బలహీనంగా భావించడమే పెద్ద పాపం.
* ఒక రోజులో మీకు ఎటువంటి సమస్యలు లేనప్పుడు- మీరు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారని అనుకోవాలి.
* మనల్ని మనం దృఢంగా మార్చుకోవడానికి వచ్చే గొప్ప వ్యాయామశాల ప్రపంచం.
* సర్వశక్తి నీలోనే ఉంది.. మీరు ఏదైనా చేయగలరు.
* మిమ్మల్ని మీరు విశ్వసించనంత వరకు మీరు దేవుడిని నమ్మలేరు.
* మనం ఎంత ఎక్కువగా బయటకు వచ్చి ఇతరులకు మేలు చేస్తే, మన హృదయాలు శుద్ధి అవుతాయి. దేవుడు వారిలో ఉంటాడు.
* ప్రతీ రోజు అద్ధం ముందు నిల్చొని మాట్లాడండి.. లేదంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ కోల్పోతారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version