Dil Raju Bollywood Entry: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాలతో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అందువల్లే వాళ్లకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప గుర్తింపు అయితే వస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు… ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దిల్ రాజు సైతం ప్రస్తుతం హిందీలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన ఈ సంవత్సరం సూపర్ సక్సెస్ ని సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ సినిమాని రీమేక్ చేయడానికి అక్షయ్ కుమార్ తో పాటు మరొక హీరో ని కూడా సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అమీర్ ఖాన్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ ఎప్పుడో ఫైనల్ అయినప్పటికి ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే ఏమీ రాలేదు.
ఇక అమీర్ ఖాన్ సైతం ఈ సినిమా చేయడానికి ఆసక్తి గా ఉన్నప్పటికి అతని నుంచి పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ అయితే రావడం లేదు. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు ప్రాజెక్టులతో దిల్ రాజు సూపర్ సక్సెస్ ను అందుకుంటాడా లేదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి… ఇక మొన్నటిదాకా తెలుగులో తన హవా ను చూపించిన దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాతో కొంతవరకు డౌన్ ఫాల్ అయ్యాడు.
భారీ బడ్జెట్ లో సినిమాలను చేస్తే తనకు కలిసి రావడం లేదని చెప్పి లో బడ్జెట్ లో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక నితిన్ తో చేసిన తమ్ముడు సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో కొంతవరకు డీలా పడ్డాడు. మరి ఇప్పుడు ఆయన బ్యానర్ నుంచి రాబోతున్న సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…