Vijay Devarakonda: విజయ్ అంటే అస్సలు నచ్చని ఓ తండ్రి లెటర్ చూశారా?

విజయ్ ఒక్కొక్క అడుగు వేస్తూ ఎనలేని గుర్తింపు సంపాదించారు. అర్జున్ రెడ్డితో యూత్ లో క్రేజ్ సంపాదిస్తే.. గీతా గోవిందం సినిమాతో అందరి మదిలో చేరిపోయారు విజయ్. ఈయన సినిమా విడుదల వరకు చాలా మంది ఎదురుచూస్తారు.

Written By: Swathi, Updated On : April 11, 2024 4:23 pm

Vijay Devarakonda

Follow us on

Vijay Devarakonda: ఎంతో కష్టపడితే కానీ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించలేరు. ఒకసారి క్రేజ్ వచ్చినా ఆ క్రేజ్ ను సంపాదించుకోవడానికి చాలా కష్టాలు పడాలి. ముందుగా సైడ్ క్యారెక్టర్లు చేస్తుంటారు కొందరు. ఆ తర్వాత అదృష్టం బాగుంటే హీరోగా ఒక ఛాన్స్ వస్తుంటుంది. అందులో సక్సెస్ అయితే ఇక తిరుగు ఉండదు. కానీ ఆ క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిందే. ముందు సైడ్ క్యారెక్టర్లు చేస్తూ హీరోగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ.

విజయ్ ఒక్కొక్క అడుగు వేస్తూ ఎనలేని గుర్తింపు సంపాదించారు. అర్జున్ రెడ్డితో యూత్ లో క్రేజ్ సంపాదిస్తే.. గీతా గోవిందం సినిమాతో అందరి మదిలో చేరిపోయారు విజయ్. ఈయన సినిమా విడుదల వరకు చాలా మంది ఎదురుచూస్తారు. కానీ ఎందుకు ఈ మధ్య ఆశించిన ఫలితాలు రావడం లేదు. గీతా గోవిందం ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు వరుస ఫ్లాప్ లను సొంతం చేసుకున్నాయి. ఇక ఫ్యామిలీ స్టార్ తో మిశ్రమ ఫలితాలను సొంతం చేసుకున్నారు విజయ్.

అయితే కొందరికి ఈ స్టార్ హీరో నచ్చితే మరికొందరు నచ్చడు అంటారు. కొందరు పొగిడితే మరికొందరు మాత్రం విమర్శిస్తుంటారు. అలాగే ఒక వ్యక్తి విజయ్ కు లెటర్ రాశారట. ఆ లెటర్ ను సోషల్ మీడియా ద్వారా మరో వ్యక్తి పంచుకున్నారు. అందులో ముందుగా విజయ్ దేవరకొండ అంటే ఆ వ్యక్తికి నచ్చదని ఉంది. కానీ కొడుకు మొండితనం వల్ల విజయ్ గురించి తెలుసుకున్న తండ్రి ఈ హీరోకు ప్యాన్ అయిపోయారట. తన కొడుకు కూడా ముందు విజయ్ దేవరకొండ మాదిరి ఉండేవారట.

ఆయన సినిమాలు చూసేవారట. రీసెంట్ గా ఉగాదికి ఫ్యామిలీ స్టార్ సినిమా చూసి వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు మాట్లాడుకున్న తర్వాత విజయ్ మీద అభిప్రాయం మారిందట. విజయ్ చేసిన సహాయాలు, కొందరికి ఉద్యోగాలు కల్పించడం, కరోనా సమయంలో ఆయన రెమ్యూనరేషన్ నుంచి ప్రజలకు సరుకులు పంపడం, 100 మందిని మనాలీ ట్రిప్ కు పంపడం వంటివి తెలుసుకొని ఈయన మనసు వేరు, సినిమాలు వేరు అని అర్థం చేసుకున్నారా? అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయారంటూ ఆ లెటర్ లో రాశారని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకున్నారు.