Pushpa 2 First Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. నిన్న ప్రోమో విడుదల చేశారు. సాంగ్ రిలీజ్ డేట్ సైతం ప్రకటించారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన పుష్ప 2 టీజర్ ఆకట్టుకుంది.
విశేష స్పందన లభించింది. యూట్యూబ్ లో పుష్ప రాజ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పుష్పరాజ్ లుక్స్, చీర కట్టులో ఆ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు. ఈ ఒక్క టీజర్ తో పుష్ప 2 తో అల్లు అర్జున్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
పుష్ప .. పుష్ప .. పుష్పరాజ్ అంటూ సాగే సాంగ్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. మే 1న ఉదయం 11: 07 గంటలకు ఈ పాటను విడుదల చేయబోతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సీక్వెల్ కి కూడా సంగీతం అందిస్తున్నారు. పుష్ప 1లో అన్ని పాటలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఫస్ట్ సాంగ్ పుష్ప 2లో హీరో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ని తెలియజేసేలా ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాగే చేతి వేళ్ళకు ఉంగరాలతో అల్లు అర్జున్ సరికొత్తగా ఉన్నాడు. ఒక రిచ్ పుష్పరాజ్ ని ఈ సినిమా ఆద్యంతం చూడొచ్చు అని సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందన నటిస్తుంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, రావు రమేష్ వంటి వారు కీలక పాత్రలు చేయనున్నారు. ఈ సినిమా ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
