Scholarship: ప్రతి నెల రూ. 10 వేల స్కాలర్ షిప్ అప్లై చేసుకోండిలా..

విద్యార్థుల చదువు కోసం సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే ప్రోగ్రాం ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, రీసెర్చ్ స్కాలర్స్ కు సహకారం అందుతుంది.

Written By: Swathi Chilukuri, Updated On : April 25, 2024 6:02 pm

Scholarship

Follow us on

Scholarship: ఇప్పుడు చదువుకోవాలి అంటే చాలా వసతులు ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాలతో పాటు ఎన్నో కార్పొరేట్ పాఠశాలలు ఉన్నాయి. కొందరు ప్రభుత్వ స్కూల్స్ లో చదివితే మరికొందరు కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్నారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ లో చదివేవారికి కూడా స్కాలర్ షిప్ లు వస్తుంటాయి. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తుంటే.. వారికి కాస్త రిలీఫ్ గా ఉండేలా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ లు సహాయం చేస్తున్నాయి. మరి ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం అందించే ఓ స్కీమ్ గురించి తెలుసుకుందాం.

విద్యార్థుల చదువు కోసం సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే ప్రోగ్రాం ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, రీసెర్చ్ స్కాలర్స్ కు సహకారం అందుతుంది. అంతే కాదు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఎకనామిక్స్, ఫైనాన్స్, కంప్యూటర్, లా వంటి విద్యార్థులు కూడా ఈ ఇంటర్న్ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. ఇవి మాత్రమే కాదు మరిన్ని కోర్సులు చేసేవారు కూడా అప్లే చేసుకోవచ్చు.

మరి స్కాలర్ షిప్ ఎంత వస్తుంది అనే వివరాలు తెలుసుకుంటే ఎలిజిబుల్ అయినా స్కాలర్స్ కు నెలకు రూ. 10 వేల వరకు స్కాలర్షిప్ వస్తుందట. ఇందులో 20 మందిని ఎంపిక చేస్తారట. అంతేకాదు నెల లేదా రెండు నెలల వరకు కచ్చితంగా ఇంటర్నెషిప్ చేయాలనే రూల్స్ ఉన్నాయి. ఇక ఈ ఇంటర్నెషిప్ కు సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే అప్లే చేసుకోవచ్చు. మొదటి సారి మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవాలి. ఇక రెండవ విడతగా 1 సెప్టెంబర్ నుంచి 30 అక్టోబర్ వరకు ఛాన్స్ ఉంటుంది.

దీనికి కావాల్సిన సర్టిఫికెట్లు ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్, డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్, కరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, బ్యాంక్ డిటేల్స్ వంటివి అవసరం అవుతాయి. ఇక మీరు కూడా ఈ స్కాలర్ షిప్ ను పొందాలి అనుకుంటే తగిన డేట్ లో అప్లై చేసుకోండి.