https://oktelugu.com/

Rajamouli: ఎన్టీయార్ కోసమే రాజమౌళి ఆ కథ రాయించారా…? జక్కన్న చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో మొదట హీరో యంగ్ టైగరేనా..?

ప్రభాస్ 'యంగ్ రెబల్ స్టార్ ' గా ఎదగడమే కాకుండా వాళ్ల పెదనాన్న అయిన కృష్ణంరాజును మించిన హీరో గా ప్రభాస్ ఎదుగుతాడంటూ ప్రతి ఒక్కరూ అతన్ని ప్రశంసించారు. ఇక దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన యూనివర్సల్ స్టార్ గా ఎదగడమే కాకుండా సినిమా సినిమా కి తన స్టార్ డమ్ ని విస్తరింప చేసుకున్నాడనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : July 30, 2024 / 03:10 PM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక దర్శకుడు రాజమౌళి.. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో తన సినిమా ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన రీసెంట్ గా చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్నైతే తెలియజేస్తూనే తనని తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సింహాద్రి సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక దాంతో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి మరొక కథ రాయమని విజయేంద్రప్రసాద్ కి తెలియజేశారట. ఇక అప్పుడు తను ఛత్రపతి అనే ఒక క్యారెక్టర్ తో ఒక కథ మొత్తాన్ని రాసి రాజమౌళికి తెలియజేశారట. ఇక మొత్తానికైతే రాజమౌళి ఎన్టీఆర్ తో ఈ సినిమాని చేద్దామనుకున్న సమయంలో అప్పటికి రాజమౌళి వర్షం సినిమా చూశాడట.. ఇక దాంతో ఈ కథను ప్రభాస్ తో చేస్తే బాగుంటుందని తన నిర్ణయాన్ని మార్చుకొని ప్రభాస్ కి ఈ కథ చెప్పి ఒప్పించి ఈ సినిమా చేశాడట. ఇక మొత్తానికైతే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా ప్రభాస్ కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక అప్పటివరకు ఉన్న ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా తారాస్థాయి కి చేరుకోవడమే కాకుండా ఓవర్ నైట్ లో ప్రభాస్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

    ప్రభాస్ ‘యంగ్ రెబల్ స్టార్ ‘ గా ఎదగడమే కాకుండా వాళ్ల పెదనాన్న అయిన కృష్ణంరాజును మించిన హీరో గా ప్రభాస్ ఎదుగుతాడంటూ ప్రతి ఒక్కరూ అతన్ని ప్రశంసించారు. ఇక దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆయన యూనివర్సల్ స్టార్ గా ఎదగడమే కాకుండా సినిమా సినిమా కి తన స్టార్ డమ్ ని విస్తరింప చేసుకున్నాడనే చెప్పాలి…ఇక ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తీవ్రమైన నిరాశకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఛత్రపతి సినిమా కనక ఎన్టీఆర్ కి పడితే ఆయన స్టార్ డమ్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఉండేదని అలాగే తను అప్పుడే నెంబర్ వన్ హీరోగా ఎదిగేవాడని వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి ఎన్టీఆర్ తో ఇప్పటి వరకు నాలుగు సినిమాలను చేసి నాలుగింటితో బ్లాక్ బస్టర్స్ హిట్స్ ని అందించాడు. ఒక రకం గా ఎన్టీయార్ ను స్టార్ హీరోగా నిలబెట్టడం లో రాజమౌళి కీలక పాత్ర వహించాడనేది వాస్తవం.. ఇక ఛత్రపతి సినిమాతో కూడా ప్రభాస్ ను స్టార్ హీరోని చేసిన రాజమౌళి.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ కి మంచి గుర్తింపు సంపాదించి పెట్టాడు.ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేదే లేని రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో మొదటిసారిగా పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

    మరి ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధించినట్లైతే రాజమౌళి మార్క్ సినిమాలను ప్రపంచానికి పరిచయం చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చింది…ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు…