https://oktelugu.com/

Meena Husband kill Pigeons: పావురాలే మీనా భర్త ప్రాణాలు తీసిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం

Meena Husband kill Pigeons: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా సుమారు దశాబ్దాల నుండి కొనసాగుతున్న హీరోయిన్ మీనా..టాలీవుడ్ , కోలీవుడ్ మరియు మాలీవుడ్ అని తేడా లేకుండా ఈమె ప్రతి ఇండస్ట్రీ లోని అక్కడి టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..అందం తో పాటు అభినయం కూడా అద్భుతంగా కనబరిచే మీనా ఇప్పటికి సినిమాల్లో నటిస్తూనే ఉంది..ఎంతో సంతోషం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2022 / 11:40 AM IST
    Follow us on

    Meena Husband kill Pigeons: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ మోస్ట్ హీరోయిన్ గా సుమారు దశాబ్దాల నుండి కొనసాగుతున్న హీరోయిన్ మీనా..టాలీవుడ్ , కోలీవుడ్ మరియు మాలీవుడ్ అని తేడా లేకుండా ఈమె ప్రతి ఇండస్ట్రీ లోని అక్కడి టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..అందం తో పాటు అభినయం కూడా అద్భుతంగా కనబరిచే మీనా ఇప్పటికి సినిమాల్లో నటిస్తూనే ఉంది..ఎంతో సంతోషం గా సాగిపోతున్న మీనా జీవితం ఒక్కసారిగా అంధకారం లో పడిపోయింది..ఆమె భర్త విద్య సాగర్ మొన్న అర్థరాత్రి కన్నుమూసిన సంఘటన ఆమెని శోకసంద్రం లోకి నెట్టేసింది..2009 వ సంవత్సరం లో బెంగళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న విద్య సాగర్ ని పెళ్లాడిన మీనా , ఆ తర్వాత కూడా సినిమాల్లో కొనసాగింది..ఈ ఇద్దరి జంట కి నైనికా అనే కూతురు కూడా ఉంది..ఈ అమ్మాయి తమిళం లో విజయ్ హీరో గా నటించిన ‘తేరి’ సినిమాలో విజయ్ కూతురిగా నటించింది..ఈ సినిమాని తెలుగు లో ‘పోలీసోడు’ పేరు తో దబ్ కూడా చేసారు.

    Meena, Vidya Sagar, Nainika

    Also Read: Venkatesh Chanti Movie: వెంకటేష్ చంటి సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

    అయితే విద్యాసాగర్ మరణం పట్ల అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ కి సంబందించి స్టార్ హీరోలందరూ విచారం వ్యక్తపరుస్తున్నారు..ఈ ఏడాది జనవరి నెలలో మీనా కుటుంబం మొత్తం కరోనా భారిన పడింది..దీని ప్రభావం వల్లే విద్యాసాగర్ గారి ఆరోగ్యం బాగా క్షీణించింది అని చెప్పుకొస్తున్నారు డాక్టర్లు..విద్యాసాగర్ కి మొదటి నుండి ఊపిరి తిత్తుల సమస్య ఉంది..కరోనా తర్వాత ఆ సమస్య మరింత పెరిగింది..దీనికి సంబంధించిన చికిత్స ఆయన గత కొంతకాలం నుండి తీసుకుంటూనే ఉన్నారు..అయితే ఆయనకీ ఊపిరి తిత్తుల సమస్య మొదటి నుండి ఉండడానికి కారణం పావురాలు అని తెలుస్తుంది..ఆయన నివాసం ఉండే ప్రాంతం లో వేల కొద్ది పావురాలు తిరుగుతూ ఉంటాయి..అవి వదిలే వ్యర్దాల నుండి వచ్చే వాయువుని పీల్చడం వల్లే విద్యాసాగర్ కి ఊపిరి తిత్తుల సమస్య ఏర్పడింది అని..కరోనా సోకినా తర్వాత ఆ సమస్య చెయ్యి దాటిపోయ్యే స్థాయికి చేరిందని చెప్పుకొచ్చారు డాక్టర్లు..ఆయన ఊపిరి తిత్తులను మార్చాలని చూస్తున్నామని..ఈలోపే ఆయన ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం అంటూ డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.

    Pigeons

    Also Read: Pavithra Lokesh- Naresh: ఆయనతో సహజీవనం చేస్తున్నా.. నరేష్ తో పెళ్లిపై బాంబు పేల్చిన పవిత్రలోకేష్

    Tags