Chiranjeevi: చరణ్ చేయాల్సిన సినిమాను చిరంజీవి ఏరి కోరి మరి అల్లు అర్జున్ తో చేయించి హిట్ ఇచ్చాడా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా కి కమిట్ అయిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్ తో ఆ సినిమాని క్యాన్సల్ చేయించాడు.

Written By: Gopi, Updated On : May 17, 2024 10:53 am

Did Chiranjeevi make Charan film with Allu Arjun and give it a hit

Follow us on

Chiranjeevi: కొంతమంది హీరోలు చేయాలనుకున్న సినిమాలని మరి కొంతమంది హీరోలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కొందరు కథలు నచ్చక ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తే మరి కొంతమంది డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఆ సినిమాలను మిస్ అవుతూ ఉంటారు…ఇక ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమా కి కమిట్ అయిన తర్వాత చిరంజీవి రామ్ చరణ్ తో ఆ సినిమాని క్యాన్సల్ చేయించాడు.

ఇక ఆ స్క్రిప్ట్ అల్లు అర్జున్ కి అయితే బాగుంటుందని చెప్పి అల్లు అర్జున్ తో చేయించి అతనికి ఒక సూపర్ హిట్ ను అందించాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘పరుగు ‘ సినిమా… ఇక భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ‘బొమ్మరిల్లు ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఆయన రామ్ చరణ్ ను హీరోగా పెట్టి పరుగు సినిమా చేయాలని అనుకున్నాడు.

కానీ అప్పుడప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ కి పరుగు సినిమా అంత బాగా సెట్ అవ్వదు అనే ఉద్దేశ్యం తో చిరంజీవి ఆ ప్రాజెక్టు నుంచి రామ్ చరణ్ ను తప్పించి ఆ సినిమాను అల్లు అర్జున్ తో చేయించాడు. దాని ఫలితంగా అల్లు అర్జున్ కెరియర్ లో ఇదొక డీసెంట్ ఫిలింగా నిలిచిపోయింది. అలాగే అతనికి ఒక మంచి సక్సెస్ ను కూడా అందించింది. నిజానికి ఈ సినిమా అటు అల్లు అర్జున్ కి, ఇటు బొమ్మరిల్లు భాస్కర్ కి చాలా రకాలుగా హెల్ప్ అయిందనే చెప్పాలి.

అయితే ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ రామ్ చరణ్ తో ఆరెంజ్ అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్ కి ఉన్న ఇమేజ్ ని కూడా చాలా వరకు డ్యామేజ్ అయితే చేసింది. ఇక మెగాస్టార్ వల్ల అల్లు అర్జున్ ఒక భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి…