https://oktelugu.com/

ఈసారి కూడా ‘బిగ్ బాస్’ వారికి హ్యండిచ్చినట్టేనా?

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 11వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 12వ వారంలోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్-4 ముగింపు దశకు చేరుకుండటంతో కంటెస్టెంట్లలో పోటీ పెరిగి గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. Also Read: బిగ్ బాస్-4: అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్స్.. బయటపడిందిలా? బిగ్ బాస్-4లో ఎవరైతే గొడవలు పడకుండా సైలెంట్ ఉంటారో వారినే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 03:39 PM IST

    bigboss 4 participants

    Follow us on

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 11వారాలను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా 12వ వారంలోకి అడుగుపెట్టాడు. బిగ్ బాస్-4 ముగింపు దశకు చేరుకుండటంతో కంటెస్టెంట్లలో పోటీ పెరిగి గేమ్ మరింత రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

    Also Read: బిగ్ బాస్-4: అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్స్.. బయటపడిందిలా?

    బిగ్ బాస్-4లో ఎవరైతే గొడవలు పడకుండా సైలెంట్ ఉంటారో వారినే బిగ్ బాస్ టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ప్రేక్షకుల ఓటింగుతో సంబంధం లేకుండా బిగ్ బాసే కంటెస్టెంట్లను హౌస్ నుంచి బయటికి పంపుతున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ వ్యవహరిస్తుండటం కొసమెరుపు.

    తాజాగా బిగ్ బాస్ నుంచి లాస్య ఎమినేషన్ అయింది. లాస్యకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ హౌస్ లో మాత్రం ఎవరితో గొడవపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈకారణంగానే బిగ్ బాస్ ఆమెను ఎలిమినేట్ చేశాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసుతం బిగ్ బాస్ లోని లేడి కంటెస్టెంట్లలో దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా మిగిలి ఉన్నారు.

    Also Read: కరోనాలోనూ తగ్గేది లేదంటున్న యువ హీరోలు..!

    గత మూడు సీజన్లలోనూ విన్నర్లుగా మగ కంటెస్టెంట్స్ అయ్యారు. ఈసారి కూడా బిగ్ బాస్ విన్నర్ వారే అవుతారనే టాక్ ఉంది. మొదటి సీజన్ శివ బాలాజీ.. రెండో సీజన్లో కౌషల్.. మూడో సీజన్లో రాహుల్ సింప్లిగంజ్ విజేతగా నిలిచారు. రెండో సీజన్లో గీత మాధురి.. మూడో సీజన్లో యాంకర్ శ్రీముఖి రన్నర్ గా నిలిచారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరూ లేనట్లే కన్పిస్తోంది. దీంతో ఈసారి విజేత కాకపోయినా రన్నర్ రేసులోనైనా అమ్మాయిలు ఉంటారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. బిగ్ బాస్ ఈసారైనా లేడి కంటెస్టెంట్స్ కు న్యాయం చేస్తారా? లేదా అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!