This Month Release Movies: సినిమా ఇండస్ట్రీలో డిసెంబర్ నెల చాలా సెంటిమెంట్ గా మారిపోయింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాయి. అందువల్లే ఈ నెలలో చాలా మంది డైరెక్టర్లు తమ సినిమాలను రిలీజ్ కి ప్లాన్ చేసుకొంటున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ‘పుష్ప 2’ సినిమా వచ్చి భారీ రికార్డులను క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈనెల లో ఎన్ని సినిమాలు రాబోతున్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
అఖండ 2
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా వస్తున్న ‘అఖండ 2’ సినిమా ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ని కనుక మనం చూసినట్లయితే అద్భుతంగా ఉంది. దానికి తగ్గట్టుగానే సినిమా మీద అంచనాలు కూడా భారీ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది తెలియాల్సి ఉంది…
దురంధర్
రన్వీర్ సింగ్ హీరోగా వస్తున్న ‘దురంధర్’ మూవీ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది…
లాక్ డౌన్
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ లో ఏఆర్ జీవా దర్శకత్వం లో ‘లాక్ డౌన్’ అనే సినిమా ఈనెల 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…
వా వాతియార్
తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న కార్తీ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ‘వా వాతియార్’ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ఈనెల 5వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది…
కలమకవల్
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన కలమకవల్ మూవీ ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది…
మిస్టీరియస్
మహి కోమటిరెడ్డి డైరెక్షన్లో వస్తున్న మిస్టీరియస్ మూవీ డిసెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది… చిన్న సినిమాగా వస్తున్న ఈ మూవీ ఎంతటి విజయాన్ని సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది…
స కుటుంబానాం
ఉదయ్ శర్మ డైరెక్షన్ లో రామ్ కిరణ్, మెగా ఆకాష్ లు హీరో హీరోయిన్లుగా బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ లు కీలక పాత్రలను పోషిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమవుతోంది..
మోగ్లీ
కలర్ ఫోటో సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన ‘సందీప్ రాజ్’ దర్శకత్వంలో రాజీవ్ కనకాల కొడుకు అయిన రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న మోగ్లీ సినిమా సైతం ఈనెల 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది…
ప్రభుత్వ సారాయి దుకాణం
నరసింహ నంది డైరెక్షన్లో విక్రమ్ హసన్ హీరోగా వస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం మూవీ ఈనెల 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది…
ఎల్ఐకే
నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తెరకెక్కిన ఎల్ ఐ కే మూవీ డిసెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది…
బైకర్
శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ మూవీ డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేశారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 19వ తేదీన రిలీజ్ అవ్వబోతోంది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
జగన్నాథ్
బాహుబలి సినిమాతో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాకర్…ఆయన డైరెక్టర్ గా మారి భరత్ సంతోష్ నిత్య లను ప్రధాన పాత్రల్లో పెట్టి చేసిన జగన్నాథ్ మూవీ డిసెంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది…
అవతార్ 3
జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో వస్తున్న ‘అవతార్ 3’ డిసెంబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది…
దేవగుడి
బెల్లం రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో అభినవ్ శౌర్య, అనుశ్రీ, నరసింహ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దేవగుడి మూవీ కూడా ఈనెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది…
యూఫోరియా
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గౌతమ్ మీనన్ భూమిక లాంటి సీనియర్ నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు…
ఛాంపియన్
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 25వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది.
శంబాల
అది సాయికుమార్ హీరోగా శంబాల సినిమా ఈనెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది…
వృషభ
మోహన్ లాల్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ వృషభ సైతం ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం విశేషం…
పతంగ్
ప్రణీత ప్రతిపాటి దర్శకత్వంలో వంశీ, పూజిత, ప్రియా పగడాల హీరో హీరోయిన్లుగా నటించిన పతంగ్ మూవీ డిసెంబర్ 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది…
దండోరా
మురళి కాంత్ డైరెక్షన్ లో శివాజీ, బిందు మాధవి, నవదీప్, నందు, రవికృష్ణ, మౌనిక రెడ్డిలు ప్రధాన పాత్రలను పోషిస్తున్న దండోరా మూవీ కూడా ఈ నెల 25వ తేదీన రిలీజ్ అవుతుండడం విశేషం…
ఇక్కిస్
అమితాబచ్చన్ మనవడు అగస్త్య నంద డైరెక్షన్ లో వచ్చిన ‘ఇక్కిస్’ మూవీ కూడా డిసెంబర్ 25న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో రీసెంట్ గా మరణించిన ధర్మేంద్ర సైతం ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుండడం విశేషం…