Coronavirus: ప్రజల్లో కరోనా భయం తొలిగింది. సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఊపు వచ్చింది. అయితే, ఆ ఊపు ఇంకా ఎంతకాలం ఉంటుంది అనేదే ఇప్పుడు పెద్ద డౌట్ గా మారిపోయింది. మళ్ళీ ఈ మధ్య ఎక్కువగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి. ఊర్మిళ మతోండ్కర్ కరోనా బారిన పడ్డారని వార్త రాగానే ఇండస్ట్రీ మళ్ళీ ఆలోచనలో పడింది. మూడో వేవ్ ఉండే అవకాశం ఉందని అందరూ మళ్ళీ భయపడుతున్నారు.

ఇదే నిజం అయితే, ఇక సినిమా ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక, ఊర్మిళ మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. ఆమె ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తోంది. కరోనా కి ముందు వరకు రెండు సినిమాల షూట్ లో పాల్గొంటూ వస్తోంది. ఇప్పుడు ఆ రెండు సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.
ప్రస్తుతం ఊర్మిళ హోమ్ క్వారంటైన్ లో ఉంది. అలాగే ఆమె షూట్ లో పాల్గొన్న రెండు సినిమాల యూనిట్ వాళ్ళు కూడా ఐసోలేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. ఈ కరోనా కేసులు ఇలాగే కొనసాగితే.. ఇక ఇండస్ట్రీ కూడా ఐసోలేషన్ లోకి వెళ్లి పోవాల్సి వస్తుంది. ఇప్పటికే కరోనా రెండు వేవ్ లతో సినిమాలు భారీగా నష్టపోయాయి. సినిమా వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
కరోనా కారణంగా సినిమాల రిలీజ్ కూడా లేకుండా పోయాయి. అసలు కరోనా ఎప్పుడు పోతుందా అని ఇన్నాళ్లు ఎదురు చూసి చూసి.. ఈ మధ్య మళ్ళీ అందరూ యాక్టివ్ అయ్యారు. కానీ కరోనా మళ్ళీ వస్తోంది అనే సరికి అందరిలో భయం మొదలైంది. ఒకవేళ మూడో వేవ్ ఉంటే.. సినిమాల పరిస్థితి ఏమిటి ? ఓటీటీలోనైనా సినిమాలను రిలీజ్ చేద్దామంటే.. పెట్టిన పెట్టుబడులు కూడా రావేమో అని అనుమానం.
Also Read: Srinu Vaitla: ఆలీతో సరదాగా షో లో ఆసక్తికర విషయాలు వెల్లడించిన… శ్రీను వైట్ల
మొత్తానికి కరోనా కారణంగా సినిమా వాళ్ళ ఎవ్వరికీ కలిసి రావడం లేదు. హిట్ సినిమాకు కూడా కలెక్షన్స్ రావడం లేదు. కరోనా ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి.. ఇండస్ట్రీలోని జనాలకు ఒక పీడకలగా మారిపోయింది. కరోనా కారణంగా పగలు ఆందోళనగా రాత్రి భయం భయంగా బతకాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం స్పష్టంగా అర్ధం అవుతుంది.
మళ్ళీ కరోనా వస్తే.. ఈ సారి షూటింగ్ లు మొదలుపెట్టాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి మధ్యలో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కచ్చితంగా సినిమా వాళ్లకు కరోనా భారీ శాపమే.
Also Read: Sai pallavi: అలాంటి సినిమాలో చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టిన సాయి పల్లవి…