Chiru super hit song remake: ‘మెగాస్టార్ చిరంజీవి’ హీరోగా ‘అనిల్ రావిపూడి’ దర్శకత్వంలో వస్తున్న ‘మన శంకరా వరప్రసాద్’ సినిమా 2026 సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే మెగాస్టార్ చిరంజీవి మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించిన వాడవుతాడు. ఇంతకుముందు చిరంజీవి చేసిన ‘భోళా శంకర్’ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు. దాంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి తో చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడుతోంది… ఇక అనిల్ రావిపూడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ సినిమాలను కరెక్ట్ మీటర్ మీద తెరకెక్కించి సూపర్ సక్సెస్ చేయడంలో ఆయనకు చాలా మంచి అనుభవమైతే ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమాని కూడా కమర్షియల్ ఫార్మాట్ లోనే తీర్చిదిద్దుతున్నాడు.
చిరంజీవికి వింటేజ్ లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయిన అనిల్ వింటేజ్ చిరంజీవి సాంగ్ ను రీమిక్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు చిరంజీవి చేసిన రాక్షసుడు సినిమాలోని ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే సాంగ్ ని ఈ సినిమాలో రీమిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికోసం భీమ్స్ చాలా రకాల కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక ఈ సాంగ్ లో చిరంజీవి ఎలాంటి స్టెప్పులు వేస్తాడు. ఆ స్టెప్పులతో ప్రేక్షకులను ఎలా అలరిస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక మొత్తానికైతే చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. తన తోటి హీరోలందరూ సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటే చిరంజీవి మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో గొప్ప విజయాలను సాధించలేకపోతున్నాడు.
ఇక వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. చిరంజీవి ఇప్పటివరకు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టలేదు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో ఆ ఫీట్ అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… దాని కోసమే పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది…