Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Chiranjeevi: పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్లాప్ సినిమాల మీద కామెంట్స్ చేసిన చిరంజీవి...

Chiranjeevi: పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ప్లాప్ సినిమాల మీద కామెంట్స్ చేసిన చిరంజీవి…

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా నియామకమైన విషయం మనకు తెలిసిందే.. ఇక ఆయన ప్రమాణ స్వీకారానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇక అక్కడ ఆయన చేసిన సందడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా 4 దశాబ్దాల నుంచి మంచి గుర్తింపును పొందుతున్న ఒకే ఒక్క వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈయన విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఆయన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయంలో అయిన చిరంజీవి స్పందిస్తూ ఉంటాడు.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా నియామకమైన విషయం మనకు తెలిసిందే.. ఇక ఆయన ప్రమాణ స్వీకారానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇక అక్కడ ఆయన చేసిన సందడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాల విషయంలో కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. అదేంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ టైమ్ అనేది వస్తుంది. దానివల్ల మనకు ఫ్లాపులు రావడమే కాకుండా క్రేజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది.

ఇక ఇలాంటి సిచువేషన్స్ ను నేను, పవన్ కళ్యాణ్, చరణ్ ముగ్గురం కూడా ఎదుర్కున్నాం అని చిరంజీవి చెబుతూనే నాకు హిట్లర్ కి ముందు వరుసగా ప్లాప్స్ వచ్చాయి. ఇక హిట్లర్ సినిమాతో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాను అని చెప్పాడు. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఖుషి సినిమా వరకు సక్సెస్ ఫుల్ గా సాగిన పవన్ కళ్యాణ్ జర్నీ ఆ తర్వాత వరుసగా పది సంవత్సరాల పాటు ఒక్క సక్సెస్ కూడా లేకపోయిన ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో ఆ రేంజ్ సక్సెస్ ని మళ్ళీ అందుకొని కంబ్యాక్ ఇచ్చాడు.

అలాగే రామ్ చరణ్ ‘మగధీర ‘ తర్వాత చేసిన ‘ఆరెంజ్ ‘ సినిమాతో భారీ డిజాస్టర్ రావడంతో ఆ తర్వాత రచ్చ సినిమా తీసి సక్సెస్ కొట్టాడు. ఇక మొత్తానికైతే మా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ సక్సెస్ ను చూశారు. ఫెయిల్యూర్స్ ను చూశారు అంటూ చిరంజీవి అప్పట్లో కొన్ని కామెంట్లైతే చేశాడు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper