Champion Movie 2 Days Collections: సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్(Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఛాంపియన్'(Champion Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ, డైరెక్టర్ ఎందుకో సాగదీసి, స్టోరీ ని ముందుకు కదలనివ్వకుండా చేసి, ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లో విఫలం అయ్యాడు అని చూసిన ప్రతీ ఒక్కరు అంటున్నారు. ఇందులో కాసేపు పక్కన పెడితే, మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లు డీసెంట్ గానే వచ్చినప్పటికీ, రెండవ రోజు భారీ గా పడిపోయిన వసూళ్లను చూస్తుంటే, కచ్చితంగా ఈ సినిమా డిజాస్టర్ వైపు అడుగులు వేస్తోంది అని చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయలకు జరిగింది. రెండు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో ఒకసారి పరిశీలిద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే రెండవ రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి రెండవ రోజున 24 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. నైజాం ప్రాంతం నుండి డీసెంట్ హోల్డ్ ని సొంతం చేసుకున్న, సీడెడ్ మరియు కోస్తాంధ్ర నుండి పర్వాలేదు అనే రేంజ్ గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక ఓవర్సీస్ లో అయితే రెండవ రోజున దాదాపుగా 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ రెండు రోజులకు కలిపి 6 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే షేర్ దాదాపుగా 3.2 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇది డీసెంట్ రేంజ్ అయినప్పటికీ, ఫుల్ రన్ లో ఇదే రేంజ్ స్టడీ కలెక్షన్స్ ని ఈ చిత్రం రాబడుతుందా? అనే అనుమానం ప్రేక్షకుల్లో ఉంది.
నేడు, రేపు వీకెండ్ కాబట్టి, ఈ రెండు రోజులకు కలిపి మరో 5 కోట్ల గ్రాస్, రెండున్నర కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అదనంగా రావొచ్చు. ఓవరాల్ గా లాంగ్ వీకెండ్ కి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి 50 శాతం రీకవరీ అన్నమాట. న్యూ ఇయర్ హాలిడే అవ్వడం తో, ఆ రోజు కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు నమోదు అవ్వొచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే క్లోజింగ్ వసూళ్లు 8 నుండి 9 కోట్ల రేంజ్ లో ఉండొచ్చు. అదే కనుక జరిగితే బయ్యర్స్ కి ఈ చిత్రం ఫ్లాప్ గా, నిర్మాతకు డిజాస్టర్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు.