Maruti Suzuki cars 2025: భారతదేశంలో Maruti Suzuki కార్లు అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. దశాబ్దాలుగా ఈ కార్లను మిడిల్ క్లాస్ తో పాటు ఉన్నత వర్గాల వారు ఆదరిస్తున్నారు. అందుకే ఈ కంపెనీ నుంచి డెలివరీ అయిన కొన్ని కార్లు ఎన్నో ఏళ్లుగా ఆ మూడు అవుతూనే ఉన్నాయి. అయితే ఆ కార్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మార్కెట్లోకి వస్తున్న కూడా అవి హాట్ కేకు లాగా అమ్ముడుపోతున్నాయి. అయితే 2025 ముగుస్తున్న సందర్భంగా మారుతి సుజుకి కంపెనీ ఈ ఏడాదిలో అత్యధిక సేల్స్ అయినా కార్ల గురించి అధికారికంగా ప్రకటించింది. వాటిలో మూడు కార్లు ఉన్నాయి. ఆ కార్ల గురించి వివరాల్లోకి వెళ్తే..
2020లో మారుతి సుజుకి కంపెనీ ఆటోమోటివ్ కార్లు ఎక్కువగా విక్రయాలు జరుపుకుంది. మూడు మోడల్స్ మొత్తం కలిపి 35 లక్షల మైలురాయిని దాటింది. వీటిలో వ్యాగన్ఆర్, ఆల్టో, Swift కార్లు ఉన్నాయి. 1999లో మార్కెట్లోకి వచ్చిన వ్యాగన్ఆర్ కారును దశాబ్దాలుగా ఇప్పటికీ ఆదరిస్తున్నారు. ఈ మోడల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా ఉండే ఈ కారు ధర తక్కువగా ఉండడంతోపాటు ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అందుకే ఈ కారును సగటున ప్రతి నెలలో 15,000 వరకు కొనుగోలు చేశారు. పెట్రోల్ తోపాటు, సిఎన్జి ఆప్షన్ కూడా ఉండడంతో మైలేజ్ కోరుకునే వారికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది. రోజువారి ప్రయాణం చేసే వారితో పాటు లాంగ్ జర్నీ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చాలామంది దీనిని కొనుగోలు చేశారు.
మారుతి కంపెనీ నుంచి 2000 సంవత్సరంలో మార్కెట్లోకి వచ్చిన ఆల్టk10 కారు ను మొదట్లో చాలామంది కొనుగోలు చేసేవారు. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా ఉండే ఈ కారు అప్డేట్ అయి టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా అత్యధికంగా వికలాలు జరుపుకుంటుంది. 2025 చివరిలో ఈ కారు నెలవారి అమ్మకాల్లో 10,600 గా ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సేఫ్టీ విషయంలో స్టార్ రేటింగ్ పొందుతున్న ఈ కారు కొత్తగా కారు కొనాలని అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అంతేకాకుండా తక్కువ బడ్జెట్లో కారును పొందాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. అయితే ఈ ఏడాదిలో ఈ కారణం ఎక్కువమంది కొనుగోలు చేశారు.
మిడిల్ క్లాస్ పీపుల్స్ కు బెస్ట్ కార్ అంటే స్విఫ్ట్ గురించి దశాబ్దాలుగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు 2025 లో కూడా ఈ కారు బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఈ ఏడాదిలో నెలవారి అమ్మకాల్లో 20వేల యూనిట్లు పెరగడంతో ఈ కారుకు ఆదరణ తగ్గలేదని చెప్పవచ్చు SUV కార్లతో పోటీపడుతున్న ఈ కారు ఇంజన్ సామర్థ్యం ఎక్కువగా ఉండి.. ధర తక్కువగా ఉండడంతో అన్ని వర్గాల పీపుల్స్ దీనినీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.