Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలు చేస్తూనే, జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో కూడా చాలా కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే, ఐదు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ప్రతి పని కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ ఎలక్షన్ల ద్వారా ఆయన ఇండియా లెవెల్లో భారీ పాపులారిటి ని సంపాదించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి నార్త్ లో ఉన్న చాలా మంది ఆయన అభిమానులు గూగుల్ ల్లో సెర్చ్ చేస్తున్నారట…ఇక దీంతో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలను చూడడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు సుజీత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కోసం నార్త్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తెలుగు, హిందీ మార్కెట్ మీద భారీగా ప్రభావాన్ని చూపించబోతున్నాడనే విషయాలైతే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమాని సెప్టెంబర్ నుంచి పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ వల్ల ఈ సినిమాని పూర్తి చేయలేకపోతున్నాడనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది.
కాబట్టి ఈ సినిమా తొందరగా షూటింగ్ పూర్తి చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇక తను అనుకున్నట్టుగానే తన కార్యక్రమాలన్ని ముగించుకొని మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ కి రాబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…నిజంగానే పవన్ కళ్యాణ్ సినిమాను నార్త్ వాళ్ళు ఆదరిస్తారా లేదా అనేది తెలియాలంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More