https://oktelugu.com/

Tollywood: ఈ వారం థియేటర్, ఓటిటీ లో విడుదల కాబోతున్న సినిమాల వివరాలు…

Tollywood: ప్రతీవారం మాదిరే ఈ శుక్రవారం కూడా కొత్త సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అఖండ జోరు మామూలుగా లేదు. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ విశ్వరూపం చూపిస్తున్నాడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సంచలన ఘన విజయం సాధించి… మంచి కలెక్షన్లు కొల్లగొడుతుంది. మరి ఈ తరుణంలో ఈ వారంలో కూడా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్స్, ఓటిటిలో వచ్చే సినిమాలేంటో చూద్దాం… […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 12:53 PM IST
    Follow us on

    Tollywood: ప్రతీవారం మాదిరే ఈ శుక్రవారం కూడా కొత్త సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు అఖండ జోరు మామూలుగా లేదు. చాలా రోజుల తర్వాత బాలకృష్ణ విశ్వరూపం చూపిస్తున్నాడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై సంచలన ఘన విజయం సాధించి… మంచి కలెక్షన్లు కొల్లగొడుతుంది. మరి ఈ తరుణంలో ఈ వారంలో కూడా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. థియేటర్స్, ఓటిటిలో వచ్చే సినిమాలేంటో చూద్దాం…

    థియేటర్ లో :

    లక్ష్య: యువ హీరో నాగశౌర్య నటించిన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా ‘లక్ష్య’ డిసెంబర్‌ 10న థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఇందులో ‘రొమాంటిక్’ సినిమాతో కుర్రకారుని మత్తెక్కించిన కేతిక శర్మ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇటీవలే నాగశౌర్య ‘వరుడు కావలెను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా… ఆ సినిమా నిరాశపరిచింది. దీంతో ‘లక్ష్య’ తో అయినా హిట్ సాధించాలని వచ్చేస్తున్నాడు నాగశౌర్య.

    గమనం: శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా గమనం. ఈ సినిమాతోనే సంజనా రావు నూతన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. క్రియా ఫిల్మ్​ కార్ప్​, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్‌ 10న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    నయీమ్ డైరీస్: తెలంగాణ గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ‘నయీమ్ డైరీస్’ సినిమా డిసెంబర్ 10న రిలీజ్ అవ్వనుంది.

    మడ్డి: దేశంలోనే మొదటి సారి మడ్‌ రేసింగ్‌ స్టోరీతో రాబోతున్న ‘మడ్డి’ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా డిసెంబర్ 10న రిలీజ్ అవుతుంది.

    ఇవే కాకుండా బుల్లెట్ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం లాంటి చిన్న చిత్రాలు కూడా డిసెంబర్‌ 10న థియేటర్లలో రానున్నాయి.

    ఓటిటిలో :

    అమెజాన్‌ ప్రైమ్‌ లో ద ఎక్స్‌పాన్స్‌ వెబ్‌ సిరీస్‌ 6వ సీజన్‌, హాలీవుడ్ మూవీ ఎన్‌కౌంటర్‌ డిసెంబరు 10న రిలీజ్ అవ్వనున్నాయి.

    ఆహా లో ఈ వారం ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా డిసెంబర్‌ 10న రిలీజ్ అవ్వబోతుంది.

    నెట్‌ఫ్లిక్స్‌ లో టైటాన్స్‌ వెబ్‌సిరీస్‌ 3వ సీజన్‌ డిసెంబరు 8న, హిందీ సిరీస్ అరణ్యక్‌, హాలీవుడ్ సినిమా ద అన్‌ ఫర్‌గివబుల్‌ డిసెంబరు 10న రిలీజ్ అవ్వబోతున్నాయి.

    డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో హిందీ వెబ్ సిరీస్ ఆర్య డిసెంబరు 10న రిలీజ్ అవ్వబోతుంది.

    జీ5  లో హిందీ సిరీస్ కాతిల్‌ హసీనోంకే నామ్‌ డిసెంబరు 10న రిలీజ్ అవ్వబోతుంది.