బబ్లీ గర్ల్ మెహరీన్ కి, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ కి జరిగిన అంగరంగ వైభవ నిశ్చితార్థం కాస్త అర్ధంతరంగా ముగిసిపోయిన బాగోతం గురించి తెలిసిందే. మెహరీన్ ఇప్పటికే ఈ విషయాన్ని రివీల్ చేస్తూ భవ్య బిష్ణోయ్‌తో తను పెళ్లిపీటలు ఎక్కడం లేదని ట్వీట్ చేసింది. అయితే తాజాగా భవ్య బిష్ణోయ్ కూడా ఈ అంశం పై తన వివరణ ఇచ్చాడు.
భవ్య బిష్ణోయ్ మాటల్లోనే.. ‘మెహ్రీన్‌ని నేను ఎంతగానో ప్రేమించాను. అయితే, మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో మేము మా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాము. జులై 1నే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ నేను కచ్చితంగా చెప్పగలను. మెహ్రీన్ నాకు పరిచయమైన నాటి నుంచి ఆమెను నేను ఎంతగానో ప్రేమించాను.
అయితే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రేమ ఒకటి కాలేకపోయింది. మా ఇద్దరిది మంచి జోడీ అవుతుందనుకున్నాను. కానీ, కాలం మా జీవితాలను వేరేలా చేసింది. ఇక మెహ్రీన్ నుంచి నేను విడిపోతున్నందుకు బాధపడడం లేదు. బయట వినిపిస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. నేను ఆమె కుటుంబాన్ని కూడా ఎంతో గౌరవించాను. ఈ నిశ్చితార్థం రద్దు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఎవరైనా కామెంట్లు చేస్తే వారిపై నేను తగిన చర్యలు తీసుకునేలా ఎవ్వరు బ్యాడ్ కామెంట్స్ చెయ్యొద్దు.
ॐ ੴ 🙏 pic.twitter.com/Ko9I1CtM4m
— Bhavya Bishnoi (@bbhavyabishnoi) July 3, 2021
మీరందరికీ తెలుసు. నాకు, నా కుటుంబానికి సమాజంలో ఎంతో గౌరవం ఉంది. మెహ్రీన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ భవ్య బిష్ణోయ్ మెసేజ్ పెట్టాడు. మొత్తానికి మెహరీన్ కి అదృష్టం వాచినట్టు వచ్చి చేజారిపోయింది.