Priyanka Singh: బిగ్ బాస్ ఫేమ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ ను ఇంకా పెంచుకోవడానికి నిత్యం ఏదో ఒక ఫోటో పంచుకుంటూ ఉంటుంది ప్రియాంక. అయితే, తాజాగా ఆమె హల్దీ ఫొటోస్ పంచుకొని అందరికీ షాక్ ఇచ్చింది. పైగా ఈ ఫోటోల్లో ప్రియాంక పెళ్లికూతురులా తయారయ్యి కనిపించింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రియాంక త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ ప్రియాంక ఫోటోషూట్ లాగా తీయించుకుందో లేక త్వరలో పెళ్లి చేసుకోనుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే ఫోటోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.

అన్నట్టు బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక బాగానే రొమాన్స్ చేసింది. ఆ సీజన్లో మరింత వెరైటీగా ట్రాన్స్ జెండర్ తో కూడా లవ్ ట్రాక్ నడిపారు. కంటెస్టెంట్ ప్రియాంక మానస్ ని ప్రాణప్రదంగా ప్రేమించింది. హౌస్ లో అడుగుపెట్టిన నాటి నుండి ఎలిమినేట్ అయ్యే వరకు అతని సేవలో తరించింది. ఓపెన్ గా మేము లవర్స్ అని చెప్పుకోనప్పటికీ… అంతకు మించి అన్యోన్యంగా హౌస్ లో ఈ జంట మెలిగారు. ఈ బంధంలో డామినేషన్ మొత్తం మానస్ దే. తిట్టినా, కొట్టినా, విసిగించుకున్నా… ప్రియాంక మానస్ ని వదిలేది కాదు.
Also Read: Highest Paid Actors: ఈ అగ్ర హీరోల ఒక రోజు సంపాదన ఎంతో తెలిస్తే అవాక్కే
ఈ క్రమంలో వీరి రిలేషన్ మరింత బలపడింది. ఎంతగా అంటే ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా. గేమ్స్ లో , టాస్క్ లలో ఒకరికొకరు మద్దతుగా నిలిచే వారు. ఓ ప్రక్క మాది కేవలం స్నేహం అంటూనే రొమాన్స్ ఓ రేంజ్ లో కురిపించారు. ఎంతైనా స్నేహం విషయంలో హద్దులు ఉంటాయి. కానీ ఆ ఫ్రెండ్షిప్ పరిమితులు వీరి మధ్యలో కనిపించలేదు.

పేరుకు మాత్రమే వీరు ఫ్రెండ్స్. వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. కారణం వాళ్ళ మధ్య చోటు చేసుకునే సంఘటనలే. ప్రియాంక తనతో కాకుండా మరో అమ్మాయితో క్లోజ్ గా ఉంటే ఆమెకు అస్సలు నచ్చదు. వెంటనే రియాక్ట్ అవుతుంది. నిజానికి మానస్ ఎన్ని మాటలు అన్నా… ప్రియాంక తిరిగి ప్రశ్నించదు. అతన్ని బ్రతిమిలాడు కోవడం చేస్తుంది. మరి ఈ బంధం ఒక్కటి కాబోతుందా చూడాలి.
Also Read:BJP Target Jharkhand- Delhi: బీజేపీ టార్గెట్ ఝార్ఖండ్, ఢిల్లీ లేనా? ఎలా కూల్చబోతోంది?

