https://oktelugu.com/

Priyanka Jain Marriage: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ… ఎట్టకేలకు గుడ్ న్యూస్!

రీసెంట్ గా ప్రియాంక జైన్ తన పుట్టింటికి వెళ్ళింది. బెంగళూరు వెళ్లిన ప్రియాంక కొన్ని రోజులుగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. పైగా పుట్టింట్లో ఓ ప్రత్యేకమైన పూజ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 30, 2024 / 10:10 AM IST

    Priyanka Jain Marriage

    Follow us on

    Priyanka Jain Marriage: బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె అతి త్వరలోనే ప్రియుడు శివ్ కుమార్ ని పెళ్లాడనుందట. చాలా కాలంగా శివ్ కుమార్ తో కలిసి సహజీవనం చేస్తుంది ప్రియాంక. పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉండటం పై ఈ జంట అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటాం అంటూ శివ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రియాంక కూడా కన్ఫార్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

    రీసెంట్ గా ప్రియాంక జైన్ తన పుట్టింటికి వెళ్ళింది. బెంగళూరు వెళ్లిన ప్రియాంక కొన్ని రోజులుగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. పైగా పుట్టింట్లో ఓ ప్రత్యేకమైన పూజ చేసింది. అదంతా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. ప్రియాంక కొన్నాళ్లుగా వైభవ లక్ష్మి వ్రతం చేయాలని అనుకుంటుందట. కానీ షూటింగ్స్ వలన వల్ల అది కుదరడం లేదని .. అందుకే ఈసారి ఎలాగైనా వ్రతం చేయాలని బెంగళూరు వెళ్లిందట.

    ఇక తన తల్లితో కలిసి ఈ వైభవ లక్ష్మి వ్రతం చేసింది ప్రియాంక. అనంతరం చిన్న పిల్లల్ని పిలిచి వాయినాలు ఇచ్చింది. దాంతో పాటు ఆ పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇచ్చింది. అనంతరం ప్రియాంక మాట్లాడుతూ .. తన పుట్టింట్లో ఇదే చివరి వ్రతం అని చెప్పింది. కొద్దిరోజుల్లో తనకు పెళ్లి అవుతుందని వెల్లడించింది. ఇకపై ఈ పూజలన్నీ తన అత్తారింట్లో చేసుకుంటానని ప్రియాంక చెప్పుకొచ్చింది.

    దీన్నిబట్టి ప్రియాంక జైన్ అతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. మౌనరాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్ లో నటించి ప్రియాంక ఇమేజ్ సంపాదించింది. బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసి మరింత క్రేజ్ దక్కించుకుంది. హౌస్ లో సత్తాచాటి ఫైనలిస్ట్ గా నిలిచిన ప్రియాంక టాప్ 5 స్థానంలో బయటకు వచ్చింది. యాక్టింగ్ బ్రేకిచ్చి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది ప్రియాంక జైన్.