Balakrishna- Mokshagna: టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యయిన్ ‘శ్యామ్ సింగరాయ్’ తో నేషనల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, తాజాగా రాహుల్ సంకృత్యయిన్, బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నందమూరి మోక్షజ్ఞ కూడా కనిపించబోతున్నాడట. మోక్షజ్ఞ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. ఇంటర్వెల్ కి ఫుల్ ఎమోషనల్ గా సినిమా టర్న్ అయ్యేలా మోక్షజ్ఞ పాత్ర ఉంటుందని.. ఇది ఒక యూనిక్ పాత్ర అని, ఇదొక ఫిక్షనల్ మైథలాజికల్ ఫిల్మ్ అని తెలుస్తోంది.

దీని పై త్వరలోనే అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి నిజంగానే నందమూరి మోక్షజ్ఞ, బాలయ్య సినిమాలో నటిస్తే.. నందమూరి అభిమానులకు ఫుల్ పండగే. అసలుకే.. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై ఫ్యాన్స్ ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఇన్నాళ్లకు ఆ ఎంట్రీ ఉండబోతుంది. పైగా నందమూరి మోక్షజ్ఞ నటిస్తే వచ్చే ఆ క్రేజ్, బాలయ్య సినిమాకి బాగా కలిసొస్తుంది.
Also Read: Ananya Panday: ఆ హీరోయిన్ కి కోటి ఇచ్చి బుక్ అయిన నిర్మాత !
రాహుల్ సంకృత్యయిన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ.. ‘నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలో మైథలాజికల్ డ్రామా అద్భుతంగా ఉండబోతుంది, అలాగే కామెడీ డోస్ ఉంటుంది, అన్నిటికీ మించి అన్ని అనుకుంటే జరిగితే.. అదొక సీరియస్ యాక్షన్ డ్రామా అవుతుంది అని చెప్పుకొచ్చాడు.
రాహుల్ సంకృత్యయిన్ మాటలను బట్టి.. బాలయ్య సినిమాని భారీగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. పైగా బాలయ్యతో పాటు నందమూరి మోక్షజ్ఞ కూడా సినిమాలో ఉంటాడు. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఆ అంచనాలకు తగ్గకుండానే సినిమాని ప్లాన్ చేస్తున్నాడట రాహుల్ సంకృత్యయిన్. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట.

మరి రాహుల్ సంకృత్యయిన్ – బాలయ్య బాబు – మోక్షజ్ఞ లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే… ఆ కిక్కే వేరు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, వైవిధ్యమైన వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ పై నెటిజన్లు కూడా ఆసక్తి ఉంది. ఎలాగూ ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. ఆ రకంగానూ బాలయ్యకి క్రేజ్ రెట్టింపు అయ్యింది. కాబట్టి.. వీరి కలయికలో రానున్న సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో చేస్తారట.
[…] Also Read: Balakrishna- Mokshagna: ఒకే సినిమాలో బాలయ్య – మోక్ష… […]
[…] Also Read: Balakrishna- Mokshagna: Balayya – Mokshagna in a single movie… this is a mythological drama! […]