Janasena Early Elections: కాలం ఎప్పుడైనా మారొచ్చు.. జగన్ ప్రతిపక్షాలు బలంగా కాకూడదని ‘ముందస్తు’కు వెళ్లొచ్చు.. ఏపీలో జనసేనకు ఆదరణ పెరుగుతుండడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల అనంతరం నిర్మాణాత్మక శక్తిగా జనసేన ఎదగడం ఖాయమంటున్నారు. అధికారం దిశగా అడుగులు వేస్తోందన్న ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఒక స్థానానికే పరిమితమైన ఆ పార్టీకి ఇంతలా ఆదరణ పెరగడానికి కారణం ఏమిటి? ఇంతకీ ఆ పార్టీకి వచ్చే సీట్లు ఎన్ని? ముందస్తు ఎన్నికలు జరిగితే.. అటు సర్వేలు, ఇటు నిపుణులు ‘జనసేన’కు మెజార్టీ సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. వైసీపీపై వ్యతిరేకతనే జనసేనకు బలం అవుతుందని అంటున్నారు. టీడీపీ అందిపుచ్చుకోలేని వ్యతిరేకతను జనసేన క్యాష్ చేసుకుంటుందని అంటున్నారు.

పవన్ లీగల్ సెల్ సమావేశంలో వైసీపీకి కేవలం 45 నుంచి 69 సీట్లకే పరిమితం కానుందని స్పష్టం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నివేదికలు అందిన తరువాతే పవన్ ఈ ప్రకటన చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. జనసేనకు ఆదరణ ఉన్నా దానిని బలోపేతం దిశగా మలుచుకోలేకపోతున్నారని నివేదికలు పవన్ కు అందినట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గాడిలో పెట్టి తరువత ప్రజా క్షేత్రంలోకి దిగాలని పవన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే కొద్ది నెలల ముందు నుంచి సన్నాహాలు చేసుకుంటూ వచ్చిన బస్సు యాత్రను సైతం ఆయన వాయిదా వేసుకున్నారు.
Also Read: Centre Bans PFI: కేంద్రం సంచలన నిర్ణయం.. పీఎఫ్‌ఐ పని ఖతం.. ఐదేళ్లు నిషేధం!
అయితే ఇప్పుడు సర్వే సంస్థలు, నిపుణుల నివేదికలు పవన్ కు అందాయని ప్రచారం సాగుతోంది. వైసీపీ కేవలం 45 నుంచి 69 స్థానాలకే పరిమితం కానుందని తెలియడంతో.. అసలు జనసేనకు వచ్చే స్థానాలు ఏమిటన్నది ఇప్పడు హాట్ టాపిక్ మారింది. అయితే వైసీపీ మాత్రం అధికారానికి దూరం కావడం ఖాయమని మాత్రం తెలుస్తోంది. అదే జరిగితే అధికారంలోకి ఎవరూ వస్తారన్నది ప్రశ్న. వైసీపీకి పోను మిగతా 100కు పైగా స్థానాలున్నాయి. అవి టీడీపీ, జనసేన పంచుకుంటాయి. జనసేనతో పోల్చుకుంటే టీడీపీకి సంస్థాగత బలం ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది. అంత మాత్రాన అధికారం అందిపుచ్చుకునేంతగా రాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు.అందుకే అప్పుడు జనసేన కీలకం కానుందని చెబుతున్నారు.

కాస్తా కృషిచేస్తే జనసేన జెండా రెపరెపలాడడం ఖాయమని పవన్ గంటాపధంగా చెబుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ ఆయన అధికారం గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏకంగా వైసీపీకి దక్కే స్థానాలను గణంకాలతో చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో జనసేనకు బలం అమాంతం పెరిగిందని చెప్పడం ద్వారా గెలుపొందే నిర్థిష్టమైన స్థానాల జాబితా ఆయన వద్ద ఉన్నట్టు అవగతమవుతోంది.
ఎంతకాదనుకున్నా పవన్ కళ్యాణ్ పార్టీ ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 60-70 మధ్య సీట్లు సాధిస్తుందని.. ఏపీలో హంగ్ వస్తే కీలకంగా మారి పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీ ఎక్కడం ఖాయమని అంటున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేనకు దాదాపు 150 సీట్లలో సమానంగా సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏరెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.. వైసీపీతో ఎలాగూ టీడీపీ, జనసేన కలవవు. ఈ రెండూ పార్టీలు కలిస్తే ఖచ్చితంగా సీఎంగా పవన్ కళ్యాణ్ ఆ సీట్లో కూర్చుంటారని జనసైనికులు భావిస్తున్నారు.
Also Read: TDP- Jana Sena: పెరుగుతున్న జనసేన గ్రాఫ్.. ఓటు షేర్ పై టీడీపీలో కలవరం
[…] […]
[…] Also Read: Janasena Early Elections: How many seats will Janasena win in early elections? […]
[…] […]
[…] […]