Indira Devi: ఇందిరాదేవి మహేష్ బాబు ఇంట్లో ఉండదా? ఎవరింట్లో ఉండేది?
Indira Devi: సాధారణంగా వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడతారు. ఆడపిల్లలంటే పేరెంట్స్ తో ఉండరు. పెళ్ళయాక భర్తతో పాటు వేరే ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి చివరి రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత అబ్బాయిలదే. జీవించినంత కాలం కొడుకుల వద్దే పేరెంట్స్ ఉంటారు. కానీ మహేష్ తల్లి ఇందిరా దేవి మాత్రం కూతుళ్ళ దగ్గర ఉండేవారు. మహేష్ బాబు నివాసంలో కేవలం భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార ఉంటారు. కృష్ణ సపరేట్ గా ఫార్మ్ […]

Indira Devi: సాధారణంగా వృద్ధాప్యం వచ్చాక తల్లిదండ్రులు పిల్లల మీద ఆధారపడతారు. ఆడపిల్లలంటే పేరెంట్స్ తో ఉండరు. పెళ్ళయాక భర్తతో పాటు వేరే ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి చివరి రోజుల్లో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత అబ్బాయిలదే. జీవించినంత కాలం కొడుకుల వద్దే పేరెంట్స్ ఉంటారు. కానీ మహేష్ తల్లి ఇందిరా దేవి మాత్రం కూతుళ్ళ దగ్గర ఉండేవారు. మహేష్ బాబు నివాసంలో కేవలం భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార ఉంటారు. కృష్ణ సపరేట్ గా ఫార్మ్ హౌస్ లో ఉంటారట. కృష్ణ దగ్గర స్టెప్ సన్ నరేష్ ఉంటారు.

Indira Devi
విజయనిర్మల చనిపోయే వరకూ కృష్ణ ఆమెతోనే ఉన్నారు. ఇందిర ఆయనకు దూరంగా ఉండేవారు. విజయ నిర్మల 2019లో గుండెపోటుతో మరణించారు. విజయనిర్మల మరణం తర్వాత కూడా కృష్ణ, ఇందిరా దేవి ఒక గూటికి చేరలేదు. అయితే పండుగలు, పుట్టినరోజులు, వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో కలిసేవారు. చాలా కాలంగా ఇందిరా దేవి వీల్ చైర్ కి పరిమితమయ్యారు.
Also Read: Balakrishna- Mokshagna: ఒకే సినిమాలో బాలయ్య – మోక్షజ్ఞ… ఇదొక మైథలాజికల్ డ్రామా !
ఆమె మహేష్ తో ఉండకపోవడానికి కారణం ఏంటంటే.. మహేష్ ఎప్పుడూ సినిమా షూటింగ్ లతో బీజీగా ఉంటాడు. ఇక నమ్రత ఏమో మహేష్ స్థాపించిన వ్యాపారాలను చూసుకుంటుంది. పిల్లలు సితార, గౌతమ్ స్కూలుకు వెళతారు. సో ఇంట్లో ఒక్కదాన్నే ఉండడం ఇష్టం లేకనే ఇందిరా దేవి కూతుళ్లు అయిన మంజుల, ప్రియదర్శి వద్దనే ఇందిరా దేవి ఉండేవారు మంజుల, ప్రియదర్శిని హౌస్ వైఫ్ గా ఇంట్లోనే ఉంటారు. వారు వ్యాపారాలు ఏం చేయరు. సో తల్లిని చూసుకునేవారు.. కూతుళ్ల పిల్లలతో ఆడుకోవడం, సరదాగా గడపడం ఇందిరకు ఇష్టమైన వ్యాపకం. మహేష్ పిల్లలు సితార, గౌతమ్ తో కూడా ఇందిరకు మంచి అనుబంధం ఉంది. ఇందిరా దేవి పార్థివ దేహం వద్ద సితార వెక్కి వెక్కి ఏడవడం మనం చూడవచ్చు. నాన్నమ్మ ఇందిరా దేవి తమ ఇంట్లో లేకున్నా మహేష్ పిల్లలు తరచుగా ఆమె వద్దకు వెళ్లేవారు.

Indira Devi
ఇక ఇందిరా చివరి రోజుల్లో మహేష్ ఆమె ప్రక్కనే ఉన్నారు. త్రివిక్రమ్ షూటింగ్ మొదలయ్యాక మహేష్ ఆపివేశాడు. ఆ షెడ్యూల్ మధ్యలో ఆపడానికి కారణం ఇందిరాదేవి ఆరోగ్యమే అని తెలుస్తుంది. ఇందిరా దేవి ఇంకా కొద్దిరోజులు మాత్రమే జీవిస్తారని వైద్యులు ధ్రువీకరించారు. అందుకే ఆమె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఇందిరా దేవి చివరి క్షణాల్లో మహేష్ పక్కనే ఉన్నారు. ఇక ఇందిరా దేవి అంత్యక్రియలు కొడుకుగా మహేష్ పూర్తి చేశారు. మహాప్రస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: Ananya Panday: ఆ హీరోయిన్ కి కోటి ఇచ్చి బుక్ అయిన నిర్మాత !
