https://oktelugu.com/

Tollywood Directors: తెలుగు లో రొటీన్ కమర్షియల్ సినిమాలు తీసే డైరెక్టర్స్ వీళ్లేనా..?

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా కూడా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో తెరకెక్కుతూ ఉంటాయి. అయితే ఈయన సినిమాలన్నీ కూడా ఒకే స్టోరీ లైన్ లో నడుస్తూ ప్రేక్షకుడిని చాలా వరకు ఇబ్బందికి గురిచేస్తుంటాయనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : May 18, 2024 / 07:49 AM IST

    Tollywood Directors

    Follow us on

    Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు రోటీన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక వాటిని ఒక వర్గం ప్రేక్షకులు ఇష్టపడినప్పటికీ మరి కొంతమంది మాత్రం ఆ సినిమాలను చూడడానికి అసలు సాహసం కూడా చేయరు. ఇక ఇలాంటి రొటీన్ కమర్షియల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ లో ఎవరున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం.

    బోయపాటి శ్రీను

    బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ప్రతి సినిమా కూడా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో తెరకెక్కుతూ ఉంటాయి. అయితే ఈయన సినిమాలన్నీ కూడా ఒకే స్టోరీ లైన్ లో నడుస్తూ ప్రేక్షకుడిని చాలా వరకు ఇబ్బందికి గురిచేస్తుంటాయనే చెప్పాలి. ప్రతి సినిమా స్టోరీ ఒకటే ఉంటుంది. కానీ ఫైట్స్ లో కానీ, ఎమోషన్ బిల్డ్ చేయడంలో గాని తను చాలా మంచి ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఆ సినిమాలనేవి భారీ సక్సెస్ లను అందుకుంటూ ఉంటాయి. కానీ ఒక వర్గం ప్రేక్షకులు ఈయన సినిమాలను చూడడం కూడా మానేశారు…

    గోపీచంద్ మలినేని

    ఈ దర్శకుడు చేసిన సినిమాలు కూడా చాలా రొటీన్ రొట్ట ఫార్ములాలో నడుస్తూ ఉంటాయి. ఒకటి రెండు ట్విస్ట్ లను బేస్ చేసుకొని ఈ దర్శకుడు సినిమాలను నడిపిస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాలు సక్సెస్ సాధించినప్పటికీ అవి ఏవి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే కాదు. ఇక రవితేజతో చేసిన క్రాక్ సినిమా ఒకటి కొంతవరకు ఆయన ఇమేజ్ ని బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు తో చేసిన వీర సింహా రెడ్డి సినిమా ఆశించిన మేరకు సక్సెస్ అయితే అందించలేదు.

    ఇక దానికి తోడుగా ఈ సినిమాలో కూడా నరకడం, చంపడం లాంటి రొటీన్ ఫార్ములానే వాడుతూ సినిమా చేయడం అనేది ఆయనకి చాలా పెద్ద మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇక మీదట అయిన వీళ్ళు మారిపోయి మంచి కథలతో సినిమాలు చేస్తే బాగుంటుంది అంటూ మరికొంత మంది వాళ్ల అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు…