Ravi Teja: రవితేజ బాబీ కాంబో లో రానున్న మరో సినిమా… రవితేజ క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

ప్రస్తుతానికి బాబీ బాలయ్య హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రవితేజతో చేయబోయే సినిమా మీద ఆయన పూర్తి ఎఫర్ట్ పెట్టాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో పవర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా బాబీ దర్శకుడి గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమం లోనే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పవర్ సినిమాను బీట్ చేసేలా మరొక పవర్ ఫుల్ సబ్జెక్టుతో వీళ్ళు మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

Written By: Gopi, Updated On : July 14, 2024 1:51 pm

Ravi Teja

Follow us on

Ravi Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజాగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రవితేజ… ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘మిస్టర్ బచ్చన్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడితో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా తరువాత బాబి డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతానికి బాబీ బాలయ్య హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రవితేజతో చేయబోయే సినిమా మీద ఆయన పూర్తి ఎఫర్ట్ పెట్టాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో పవర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా బాబీ దర్శకుడి గా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమం లోనే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన పవర్ సినిమాను బీట్ చేసేలా మరొక పవర్ ఫుల్ సబ్జెక్టుతో వీళ్ళు మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పవర్ సినిమాకి సీక్వెల్ గా ఏమైనా వస్తుందా లేదా ఫ్రెష్ సబ్జెక్టుతో వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే బాబీ ఇప్పటికే రవితేజకు స్టోరీ వినిపించాడట. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో రవితేజ ఒక క్యారెక్టర్ లో లెక్చరర్ గా కనిపిస్తే మరొక క్యారెక్టర్ లో పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి..ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారమైతే ఇది ఫ్రెష్ సబ్జెక్ట్ తోనే తెరకెక్కబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి రవితేజ భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ‘మిస్టర్ బచ్చన్’ ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా మీదనే తను పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ కూడా బయటకు వచ్చింది.

ఆ సాంగ్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోగా కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. ఇక ఇదే ఊపులో కనక రవితేజ ముందుకు దూసుకెళ్తే మాత్రం రవితేజ మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకొనే అవకాశమైతే ఉంది. ఇక రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో ఏ దర్శకులకైతే అవకాశం ఇచ్చాడో మళ్ళీ ఆ దర్శకులతోనే సినిమాలు చేస్తూ ముందుకు సాగే అవకాశాలైతే ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్నాడు. అలాగే నెక్స్ట్ బాబీతో చేస్తున్నాడు.

ఇక మళ్ళీ గోపీచంద్ మలినేని తో కూడా ఇంకొక సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితుల్లో చర్చలైతే జరుగుతున్నాయి… ఇక రవితేజ వీటితోపాటుగా మరో ఇద్దరు కొత్త దర్శకులను కూడా లైన్ లో పెట్టినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. కొత్త పాత అని తేడా లేకుండా రవితేజ అందరితో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తనకి సబ్జెక్టు నచ్చితే చాలు ఆ డైరెక్టర్లతో సినిమా చేయడానికి తను ఎప్పుడు ముందుంటారని మరొకసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు. చూడాలి మరి ఈ సినిమాలతో రవితేజ ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…