https://oktelugu.com/

లాస్యను క్షమించమని కోరిన యాంకర్ రవి.. అసలేమైందంటే..?

దాదాపు దశాబ్దం క్రితం రవి లాస్య ఒకే సమయంలో యాంకర్లుగా కెరీర్ ను ప్రారంభించారు. మా మ్యూజిక్ ఛానెల్ లో సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ కు మొదట రవి యాంకర్ గా వ్యవహరించగా ఆ తరువాత రవి లాస్య కలిసి చేసిన ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఆ తరువాత రవి లాస్య జంటగా చాలా ప్రోగ్రామ్ లు చేయగా చేసిన ప్రతి ప్రోగ్రామ్ హిట్ కావడంతో పాటు ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 3, 2021 / 01:40 PM IST
    Follow us on


    దాదాపు దశాబ్దం క్రితం రవి లాస్య ఒకే సమయంలో యాంకర్లుగా కెరీర్ ను ప్రారంభించారు. మా మ్యూజిక్ ఛానెల్ లో సంథింగ్ స్పెషల్ అనే ప్రోగ్రామ్ కు మొదట రవి యాంకర్ గా వ్యవహరించగా ఆ తరువాత రవి లాస్య కలిసి చేసిన ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఆ తరువాత రవి లాస్య జంటగా చాలా ప్రోగ్రామ్ లు చేయగా చేసిన ప్రతి ప్రోగ్రామ్ హిట్ కావడంతో పాటు ఇద్దరికీ మంచి పేరు వచ్చింది.

    Also Read: ఆ వరం టాలీవుడ్‌కి ఎప్పుడో..

    రవి లాస్య జోడీ గురించి యూట్యూబ్ ఛానెళ్లలో, సోషల్ మీడియాలో వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా గాసిప్స్ గుప్పుమన్నాయి. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షో కొన్ని సీజన్లకు కూడా రవి లాస్య జోడీ టీం లీడర్లుగా వ్యవహరించి ఆ సీజన్లు సక్సెస్ కావడానికి కృషి చేశారు. అయితే ఆ షో తరువాత రవి లాస్య కలిసి ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో లాస్య తాను మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించానని అతనినే పెళ్లి చేసుకుంటానని మీడియాకు తెలియజేశారు.

    Also Read: క్రేజ్ ను బాగా క్యాష్ చేసుకుంటుంది !

    ఆ తరువాత లాస్య రవిపై ఒక ఇంటర్వ్యూలో కొన్ని నెగిటివ్ కామెంట్లు చేయడంతో వాళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తరువాత కలిసి పని చేయని రవి లాస్య మళ్లీ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమయ్యే ఇట్స్ టు పార్టీ అనే ప్రోగ్రామ్ కోసం కలిసి పని చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోలో రవి లాస్యకు సారీ చెప్పడం గమనార్హం. ఐదేళ్ల క్రితం విడిపోయిన రవి లాస్య మళ్లీ కలిసిపోయామని ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    యాంకర్ రవికి కజిన్ అయిన బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ వల్లే వీళ్లిద్దరూ మళ్లీ కలిశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం యాంకర్ రవికి కూడా పెద్దగా అవకాశాలు లేవు. రవి లాస్య ఈ ప్రోగ్రామ్ కు మాత్రమే కలిసి పని చేస్తారో లేక భవిష్యత్తులో కూడా కలిసి పని చేస్తారో చూడాల్సి ఉంది.