Anasuya: స్లీవ్ లెస్ ఫ్రాక్ లో అనసూయ చిలిపి ఫోజులు… కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్!

ప్రేమ విమానం చిన్న పిల్లలకు సంబంధించిన సినిమాగా తెలుస్తుంది. ఇక అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె వరుస చిత్రాలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.

Written By: Shiva, Updated On : October 9, 2023 1:14 pm
Follow us on

Anasuya: అనసూయ తాజా మూవీ ప్రేమ విమానం. ఆమె ప్రధాన పాత్ర చేశారు. అక్టోబర్ 13 నుండి జీ తెలుగులో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటుంది అనసూయ. దీనిలో భాగంగా స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించింది. సదరు సూపర్ హాట్ డ్రెస్ లో ఫోటో షూట్ చేసింది. చిలిపి ఫోజులతో కవ్వించే ప్రయత్నం చేసింది. ఎంత పెద్దవాళ్ళమైనా మనలోని చిన్న పిల్లల మనస్తత్వాన్ని వీడకూడదు అంటూ కామెంట్ చేసింది. అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ప్రేమ విమానం చిన్న పిల్లలకు సంబంధించిన సినిమాగా తెలుస్తుంది. ఇక అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె వరుస చిత్రాలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఇటీవల పెదకాపు 1 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. పెదకాపు 1 చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. పీరియాడిక్ విలేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. కొత్త హీరో విరాట్ కర్ణ నటించిన పెదకాపు 1 నిరాశపరిచింది. అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కనీస వసూళ్లు రాబట్టలేదు.

ఇక అనసూయ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్పరాజ్ గా పార్ట్ 2లో వీర విహారం చేయనున్నారు. పుష్ప 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. 2024 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. పుష్ప 2లో దాక్షాయణిగా నెగిటివ్ రోల్ లో అనసూయ మరోసారి అలరించనుంది. అనసూయ ఇమేజ్ కి ఉపయోగపడే చిత్రం అవుతుంది. అలాగే పలు చిత్రాలు, సిరీస్లకు ఆమె సైన్ చేశారనే సమాచారం.


మరోవైపు అనసూయను బుల్లితెర ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. ఆమె యాంకరింగ్ కి పూర్తిగా దూరమైంది. ఇటీవల జబర్దస్త్ ఎందుకు మానేశారని అడగ్గా… ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. యాంకర్ గా బుల్లితెర మీద నవ్విస్తూ.. వెండితెర మీద సీరియస్ రోల్స్ చేస్తున్నాను. దీంతో ఆడియన్స్ కొంత కన్ఫ్యూస్ అవుతున్నారు. అలాగే నన్ను యాంకర్ గానే చూస్తున్నారు కానీ నటిగా చూడటం లేదు. ఈ కారణాలతో యాంకరింగ్ వదిలేశానని చెప్పారు.