Mahesh Babu Emotional: కాసేపట్లో #Globetrotter ఈవెంట్ మొదలు కాబోతుండడం తో మహేష్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులు ఎప్పుడూ లేనంత ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా మహేష్ మేనియా నే కనిపిస్తుంది. రామోజీ ఫిలిం సిటీ కి వేలాదిగా తరళి వస్తున్న అభిమానులకు సంబంధించిన విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీసి సూపర్ హిట్స్ కొడుతుంటే, మా అభిమాన హీరో ఇంకా ప్రాంతీయ బాషా చిత్రాలు చేస్తున్నాడని మహేష్ బాబు అభిమానుల్లో నిన్న మొన్నటి వరకు పెద్ద అసంతృప్తి ఉండేది. కానీ ఇన్ని రోజుల అభిమానుల ఆకలి ని, ఆవేదనని తీరుస్తూ, ఏకంగా రాజమౌళి(SS Rajamouli) తో పాన్ వరల్డ్ సినిమాని సెట్ చేసుకొని అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడు మహేష్ బాబు.
ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు కి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కృష్ణ కూడా మహేష్ సాధించే విజయాలను చూసి మీడియా ముందు ఎంతో ఆనందంతో,గర్వంగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి మనిషి నేడు అతి ముఖ్యమైన ఈ #Globetrotter ఈవెంట్ లో లేకపోవడం నిజంగా ఎంతో బాధపడాల్సిన విషయం. దీనిని మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటూ ‘ఈరోజు నేను రోజు ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచిస్తున్నాను నాన్న. నువ్వు ఏ లోకంలో ఉన్నా ఈరోజు గర్విస్తావని అనుకుంటున్నాను, ఈరోజు నా పక్కనే ఉండుంటే బాగుండేది’ అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ అభిమానుల చేత కంటతడి పెట్టించేలా చేసింది. వాస్తవానికి మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యి 15 ఏళ్ళు దాటింది.
అది కార్యరూపం దాల్చడానికి ఇంత సమయం పట్టింది. ఒకవేళ రెండు మూడేళ్ళ క్రితం ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లుంటే కృష్ణ కళ్లారా చూసి ఉండేవాడు, ఎంతో గర్వించేవాడు అంటూ అభిమానులు అంటున్నారు. కానీ ఆలస్యం అయినా, మహేష్ లాంటి గొప్ప నటుడికి ఎలాంటి సినిమా అయితే పడాలో, అలాంటి సినిమా పడబోతోంది, ఇంతకు మించి ఏమి కావాలి అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత ఎమోషనల్ అయ్యాడంటే ఈరోజు సాయంత్రం విడుదల చేయబోయే గ్లింప్స్ వీడియో ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Thinking of you a little more today…
and knowing you’d be proud nanna ♥️♥️♥️ pic.twitter.com/yuW1g9WOky— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2025
Thinking of you a little more today…
and knowing you’d be proud nanna ♥️♥️♥️ pic.twitter.com/yuW1g9WOky— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2025