Harsha Vardhan rejected Pawan Kalyan Movie: మన చిన్నతనం ‘అమృతం’ అనే కామెడీ సీరియల్ లేకుండా అసంపూర్ణం అనడం లో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఈ బ్లాక్ బస్టర్ కామెడీ సీరియల్ అప్పట్లో ఒక సంచలనం. ఈ సీరియల్ లో అమృతరావు గా నటించిన హర్ష వర్ధన్(Harsha Vardhan) ని ఆడియన్స్ అంత తేలికగా మర్చిపోలేరు. ఈ సీరియల్ కి ముందు, ఆ తర్వాత హర్ష వర్ధన్ ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో సినిమాల్లో నటించాడు. రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలై బంపర్ హిట్ గా నిల్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో హర్ష వర్ధన్ పాత్రకు ఎంతటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ఇకపోతే ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు, గొప్ప రచయితా, దర్శకుడు కూడా. టాలీవుడ్ లో సూపర్ హిట్స్ గా నిల్చిన ‘మనం’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ చిత్రాలకు మాటలు రాసింది ఈయనే.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హర్ష వర్ధన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalu తో ఉన్న బంధం గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ చిత్రం లో నేను కేవలం ఒక్క చిన్న పాత్ర చేసాను. అది ఆడియన్స్ కి పెద్దగా గుర్తు కూడా ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం అంతకు ముందే మొదలైంది. నేనంటే నాగబాబు గారికి ఎంతో ప్రత్యేకమైన అభిమానం. ఒకరోజు ఆయన పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్నప్పుడు, స్క్రిప్ట్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో హర్ష ఉంటే బాగుంటుందని, నాకు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం చేయించారు. ఈ ఐడియా తో సినిమా చేద్దామని అనుకుంటున్నాము, వీర శంకర్ గారు డైరెక్టర్, స్క్రిప్ట్ ని సిద్ధం చేయమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు’.
‘నేను ఆ కథ ని డెవలప్ చేస్తున్నప్పుడు , ఈ చిత్రం ‘ఐతే’ మూవీ కథకు చాలా దగ్గరగా ఉందే, ఇది వర్కౌట్ అవ్వదు అని అనిపించింది. ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, నేను రాయలేను సార్ అని చెప్పాలని అనుకున్నాను. కానీ మొహమాటం అడ్డొచ్చింది. నా ఇబ్బందిని గమనించిన పవన్ కళ్యాణ్ గారు , కష్టం గా ఉందా? అని అడిగారు. అవును సార్, ఇదే కాన్సెప్ట్ తో గతం లో ఐతే అనే చిత్రం వచ్చింది. మనకి వర్కౌట్ అవ్వదు అని చెప్పాను. అవునా, సరే కష్టం గా ఉంటే వదిలేయ్ లే అని చెప్పారు. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన పది రోజుల తర్వాత నాగ బాబు గారి నుండి ఫోన్ కాల్ వచ్చింది. హర్ష స్టోరీ మొత్తం మారిపోయింది, నువ్వు రా వేరే కథకి స్క్రిప్ట్ చేద్దువు కానీ అని పిలిచారు. అలా ,మొదలైంది గుడుంబా శంకర్. ఆ చిత్రం స్క్రిప్ట్ రైటింగ్ డిపార్ట్మెంట్ లో నేను కూడా ఒకడిని’ అంటూ చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్.
