https://oktelugu.com/

Nagarjuna: నాగార్జునకు ఆ వ్యసనం… భరించలేని అమల ఏం చేసిందో తెలుసా?

గతంలో నాగార్జున స్మోకింగ్ తో పాటు .. బాగా డ్రింక్ చేసేవారట. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కామన్. దాదాపు ఆల్కహాల్ అలవాటు లేని నటులు ఉండరు. కాగా పెళ్లి తర్వాత నాగార్జున భార్య అమల ఈ అలవాటు మాన్పిచేశారట.

Written By:
  • S Reddy
  • , Updated On : April 20, 2024 / 09:03 AM IST

    Nagarjuna

    Follow us on

    Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు.ఇతర హీరోలతో పోల్చితే నాగార్జునకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ జనరేషన్ సైతం నాగార్జున అంటే మక్కువ చూపిస్తారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నాగార్జున తన ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే నాగార్జునకు కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయట.

    గతంలో నాగార్జున స్మోకింగ్ తో పాటు .. బాగా డ్రింక్ చేసేవారట. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కామన్. దాదాపు ఆల్కహాల్ అలవాటు లేని నటులు ఉండరు. కాగా పెళ్లి తర్వాత నాగార్జున భార్య అమల ఈ అలవాటు మాన్పిచేశారట. నాగార్జున – అమల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా ఉంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. అయితే పెళ్ళైన కొత్తలో నాగార్జునకు ఉన్న డ్రింకింగ్ హ్యాబిట్ అమలకు అసలు నచ్చేది కాదట.

    తన భర్త చేత మెల్లమెల్లగా డ్రింకింగ్ మాన్పించేసారట. భర్తను వ్యసనం నుండి బయటపడేసి భార్యంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నారట. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరోవైపు నాగార్జున తన వందవ సినిమా కోసం పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. తన కెరీర్లో మైలురాయిగా వందవ సినిమా ఉండాలని భావిస్తున్నారట.

    ఈ సంక్రాంతికి నా సామిరంగ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున సూపర్ హిట్ అందుకున్నారు. తన వందవ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామంటూ నాగార్జున ‘ నా సామిరంగా ‘ సక్సెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగార్జున తిరిగి బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే ఐదు సీజన్లు హోస్ట్ చేసి బెస్ట్ హోస్ట్ అనిపించుకున్నారు.