Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Allu Arjun: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం.. అల్లు అర్జున్ బొమ్మ చూసి మురిసిన...

Allu Arjun: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం.. అల్లు అర్జున్ బొమ్మ చూసి మురిసిన తమ్ముడు

Allu Arjun: ఒక్క సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో అల్లు అర్జున్‌. ఆయన తీసిన పుష్ప సినిమా క్రేజ్‌ భారత్‌తోపాటు విదేశాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. ఇక హీరో అల్లు అర్జున్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం పుష్ప– 2 సినిమా షూటింగ్‌లో ఈ ఐకాన్‌ స్టార్‌ బిజీగా ఉన్నాడు. అయితే ఆయనకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్‌ మైనపు బొమ్మ ఏర్పాటు చేశాడు. దానిని ఐకాన్‌ స్టార్‌ స్వయంగా మార్చి 28న ఆవిష్కరించాడు.

తొలి సౌత్‌ ఇండియా స్టార్‌గా..
దుబయ్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు బొమ్మ ఏర్పాటు చేసే అవకాశం సౌత్‌ ఇండియా నుంచి ఒక్క అల్లు అర్జున్‌కు మాత్రమే దక్కింది. ఈ గౌరవం దక్కిన తొలి సౌత్‌ ఇండియా హీరోగా నిలిచాడు ఐకాన్‌ స్టార్‌. ఇక ఘనంగా జరిగిన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. ఈ గౌరవం దక్కించుకున్న అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

మురిసిన తమ్ముడు..
ఇదిలా ఉండగా టుస్సాడ్స్‌ మ్యూజియంలో అన్న అల్లు అర్జున్‌ మైనపు బొమ్మ చూసి ఆయన సోదరుడు అల్లు శిరీష్‌ మురిసిపోయాడు. బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతూ దుబాయ్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 15 ఏళ్ల క్రితం ఇద్దరం కలిసి దుబయ్‌ మ్యూజియం చూడడానికి టూరిస్టులుగా వచ్చామని తెలిపాడు. ఆ సమయంలో మ్యూజియంలో ఉన్న విగ్రహాలతో ఫొటోలు దిగినట్లు పేర్కొన్నాడు. ఇంత గొప్ప ప్లేస్‌లో తమ కుటుంబం నుంచి ఒకరి మైనపు బొమ్మ ఇక్కడ ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదని వెల్లడించాడు. ఆ విగ్రహంతో తాను ఫొటో దిగుతానని అనుకోలేదని తెలిపాడు. బన్నీ సినీ ప్రయాణం చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నాడు. బన్నీతో, బన్నీ మైనపు బొమ్మతో దిగిన ఫొటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

సతీమణి కూడా..
ఇక అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ కూడా బన్నీకి శుభాకాంక్షలు తెలిపింది. భార్యగా తనకు గర్వంగా ఉందని తెలిపింది. ఎక్కడైనా తనకంటూ ప్రత్యేకత చాటుకునే అర్జున్‌ ఇప్పుడు మైనపు విగ్రహంతో శాశ్వతంగా అందరినీ ఆకర్షిస్తుంటాడని తెలిపింది. మార్చి 28, 2024 ఎప్పటికీ గుర్తుండిపోతుందని స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version