Akhanda: ‘అఖండ’ విజయం టాలీవుడ్ కి ఊపు తెచ్చిందా?

Akhanda: కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ వల్ల అర్ధాంతరంగా సినిమాలు నిలిచిపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నటీనటులు, టెక్నిషియన్లు చాలా అవస్థలు పడ్డారు. సినిమా షూటింగులు లేక కార్మికులు రోడ్డున పడటంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు తలోచేయి వేసి కొన్నినెలలు వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు. సినిమా థియేటర్లు సైతం దాదాపు ఏడేనిమిది నెలలు మూతపడగా ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ తర్వాత […]

Written By: NARESH, Updated On : December 2, 2021 6:24 pm
Follow us on

Akhanda: కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీ ఇబ్బందులు పడుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ వల్ల అర్ధాంతరంగా సినిమాలు నిలిచిపోవడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, నటీనటులు, టెక్నిషియన్లు చాలా అవస్థలు పడ్డారు. సినిమా షూటింగులు లేక కార్మికులు రోడ్డున పడటంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు తలోచేయి వేసి కొన్నినెలలు వారిని ఆదుకునే ప్రయత్నం చేశారు.

Akhanda Movie

సినిమా థియేటర్లు సైతం దాదాపు ఏడేనిమిది నెలలు మూతపడగా ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ తర్వాత కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆంక్షల మధ్య షూటింగులు, సినిమాలు రీలీజు అయ్యాయి. అప్పటికే పూర్తయిన పలు చిన్న సినిమాలు ఓటీటీల్లో రిలీజయి సేఫ్ అయ్యాయి.

బడా సినిమాలు మాత్రం థియేటర్ల కోసం వెయిట్ చేసి విడుదల చేశాయి. అయితే వీటిలో చాలా సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకొని అభిమానులను నిరాశపరిచాయి. ఒకటి అర సినిమాలు మినహా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో టాలీవుడ్లో కన్పించ లేదు.

ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ పరిస్థితులు అలాంటి పరిస్థితులే కన్పించాయి. అయితే ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వచ్చిన సినిమాలన్నీ పాజిటివ్ తెచ్చుకున్నాయి. అయితే ఈ సమయంలో మాస్ సినిమాలు మాత్రం పెద్దగా రిలీజ్ కాలేదు. రవితేజ క్రాక్ మూవీ మినహా ఆ తర్వాత పూర్తి మాస్ ఇమేజ్ మూవీలు టాలీవుడ్ నుంచి పెద్దగా రాలేదు.

ఇలాంటి సమయంలో బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో ‘అఖండ’ మూవీ ఈరోజు రిలీజైంది. మాస్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూసిన అభిమానులకు ‘అఖండ’ మూవీ ఆలోటును భర్తీ చేసింది. ‘సింహా’,.. ‘లెజండ్’ మూవీ తరహాలోనే బోయపాటి ‘అఖండ’ను పూర్తి మాస్ చిత్రంగా తీర్చిదిద్దాడు.

బాలయ్య చేసిన యాక్షన్ సీన్లకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయి ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. చాలారోజుల తర్వాత విలన్ పాత్రల్లో కన్పించిన శ్రీకాంత్ ఓ రేంజులో నటించి అభిమానులను హుర్రుతలూగించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచచిన సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. అఘోర పాత్రలో బాలయ్య అదరగొట్టగా.. తమన్ బీజీఎం సినిమాకు ప్లస్ అయింది. హీరోయిన్ పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్రల్లో కన్పించి ఆకట్టుకున్నారు.

Also Read: హీరోలూ బాలయ్యను చూసి నేర్చుకోండయ్యా !

చాలా రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీ ఏదైతే కోరుకుందో దానిని ‘అఖండ’ మూవీ చేసి చూపించిందనే టాక్ విన్పిస్తోంది. కరోనా టైంలో ప్రేక్షకులు సినిమాలకు వస్తారా? లేదా మీమాంసను ఈ సినిమా పటాపంచలు చేసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖండ’ థియేటర్లన్నీ ప్రేక్షకులతో పూర్తిగా నిండిపోగా రేపటికి కూడా అడ్వాన్స్ బుకింగ్ తో హౌస్ పుల్ అయ్యాయి.

ఈ సినిమా విజయం బాలయ్య అభిమానుల్లో పునకాలను తెప్పించగా రాబోయే పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య లాంటి మాస్ మూవీలకు దారి చూపినట్లంది. మొత్తంగా ‘అఖండ’ మూవీ బాలయ్య బాబుకు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలువగా ఈ విజయం టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘అఖండ జ్యోతి’లా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: బాలయ్య ఊపు తెచ్చాడు.. బాక్సాఫీస్ ను ఊపేశాడు !