https://oktelugu.com/

Actress Hema: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్ అయిన నటి హేమ… ఆమె షాకింగ్ రియాక్షన్!

హేమ మాట్లాడుతూ... నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఓ ఫార్మ్ హౌస్లో చిల్ అవుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎలాంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదు. అదంతా ఫేక్ న్యూస్. ఎవరూ నమ్మవద్దు, అన్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 20, 2024 / 06:52 PM IST

    Actress Hema

    Follow us on

    Actress Hema: బెంగుళూరులో ఆదివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు సమాచారం. పక్కా సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు పట్టుబడినట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ కి చెందిన హేమ, శ్రీకాంత్ బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఎలాంటి రేవ్ పార్టీలో తాము పాల్గొనలేదని హేమ, శ్రీకాంత్ వీడియో బైట్స్ విడుదల చేశారు.

    హేమ మాట్లాడుతూ… నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఓ ఫార్మ్ హౌస్లో చిల్ అవుతున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎలాంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదు. అదంతా ఫేక్ న్యూస్. ఎవరూ నమ్మవద్దు, అన్నారు. అయితే వీడియో విడుదల తర్వాత ఆమె మీద అనుమానాలు మరింతగా పెరిగాయి. వీడియోలో ఉన్న డ్రెస్ లోనే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, బెంగుళూరులోనే ఉన్న హేమ ఓ ఫార్మ్ లో హౌస్లో వీడియో చేసి హైదరాబాద్ లో ఉన్నట్లు బుకాయిస్తుంది అంటూ… అధికారులు వాదిస్తున్నారని సమాచారం. హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని వినికిడి.

    ఆ రేవ్ పార్టీలో దాదాపు 100 మంది ప్రముఖులు పాల్గొన్నారట. ఓ 70 మంది అబ్బాయిలు, 30 మంది అమ్మాయిలు రేవ్ పార్టీ ఎంజాయ్ చేస్తూ పట్టుబడ్డారట. కొందరు రాజకీయవేత్తల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ని పోలిన వ్యక్తిని అధికారులు తీసుకెళుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి తన టీ షర్ట్ తో ముఖాన్ని దాచుకున్నాడు. శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో ఉన్నాడంటూ వార్తలు వస్తుండగా… ఆయన స్పందించారు.

    గతంలో నాపై విడాకుల వార్తలు వచ్చాయి. ఇప్పుడు రేవ్ పార్టీలో పాల్గొన్నాను అంటున్నారు. ఇదంతా అవాస్తవం. నేను హైదరాబాద్ లోని నా నివాసంలో ఉన్నాను. నన్ను పోలిన ఆ వ్యక్తి ఎవరో తెలియదు. నాకు పార్టీలకు వెళ్లే అలవాటు కూడా లేదు. ఏదైనా పార్టీకి వెళ్లినా ఒక గంట, అరగంటలో ఇంటికి వచ్చేస్తాను. ఈ రేవ్ పార్టీలు అంటే కూడా నాకేమిటో తెలియదు… అని శ్రీకాంత్ అన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఎవరో తెలియాల్సి ఉంది.