Fish Venkat latest health update : అనేక సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్(Fish Venkat) చాలా కాలం నుండి తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. పది రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించడం తో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. రెండు కిడ్నీలు చెడిపోవడం తో సర్జరీ కొరకు దాతల కోసం ఎదురు చూశారు. ఇన్ని రోజులు హాస్పిటల్ బిల్స్ మొత్తం దాతలే భరించారని ఫిష్ వెంకట్ కూతురు చెప్పుకొచ్చింది. కిడ్నీ దానం చేసేవాళ్ళు దొరికితే హీరో ప్రభాస్ మ్యానేజర్ సర్జరీ కి అవసరమయ్యే ఖర్చు భరిస్తామని ముందుకొచ్చిన విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఫిష్ వెంకట్ ని మెరుగైన వైద్యం కోసం మరో హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం.
Also Read: నేరుగా ఓటీటీ లోకి రాబోతున్న విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’..ఇదేమి ట్విస్ట్ సామీ!
ప్రస్తుతం తన తండ్రికి ICU లో చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని, పరిస్థితి విషమంగానే ఉందని ఫిష్ వెంకట్ కూతురు మీడియా కి తెలిపింది. కిడ్నీ, లివర్ తో పాటు, శరీరం లో ఉన్న రక్తం మొత్తం ఇన్ఫెక్షన్ కి గురైందని ఆమె సందర్భంగా చెప్పుకొచ్చింది. శరీరం లో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పటికీ ఫిష్ వెంకట్ బ్రతకడానికి పోరాటం చేస్తూనే ఉన్నారు. సహాయం చేయడానికి సినీ సెలబ్రిటీలు సిద్ధంగా ఉన్నప్పటికీ, కిడ్నీ దాతలు లేకపోవడం తో ఫిష్ వెంకట్ పరిస్థితి రోజురోజుకి దయనీయంగా తయారు అవుతుంది. ప్రస్తుతం అతను స్పృహలో కూడా లేదట. ఒకవేళ స్పృహ లోకి వచ్చినా కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడలేని పరిస్థితి లో ఉన్నాడట. పాపం కూతురు ఒంటరిగా పోరాటం చేస్తూనే ఉంది. రాబోయే రోజుల్లో అయినా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని ఆశిద్దాం. గతంలో లో ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని చిరంజీవి, రామ్ చరణ్ ఆర్ధిక సాయం అందించారు.
Also Read: రంగస్థలం నేనే చేయాల్సింది, డైరెక్టర్ తో నా సీన్స్ తీసేయమన్నాను… మొగలి రేకులు సాగర్ షాకింగ్ కామెంట్స్
ఆ తర్వాత కొన్నాళ్ళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఫిష్ వెంకట్ ని తన ఆఫీస్ కి పిలిపించుకొని , వైద్యానికి అవసరమయ్యే ఖర్చులు ఇచ్చి పంపాడు. ఇంతమంది ఇన్ని సహాయసహకారాలు అందించినా ఫిష్ వెంకట్ ఆరోగ్యం కుదుట పడలేదు. ఏడాదికి కనీసం పది సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉండే ఆర్టిస్టులలో ఒకరు ఫిష్ వెంకట్. 2023 వ సంవత్సరం వరకు ఫిష్ వెంకట్ యాక్టీవ్ గానే సినిమాలు చేస్తూ వచ్చేవాడు. అప్పటికే ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కుటుంబం కోసం సినిమాలు చేస్తూ వచ్చేవాడు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణం అవ్వడం తో ఫిష్ వెంకట్ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉన్నది. ఆయన త్వరగా కోలుకొని ఎప్పటి లాగానే మళ్ళీ సినిమాలతో బిజీ అవ్వాలని ఆశిద్దాం.