Samantha: టాలీవుడ్ లో సమంతకు లక్కీ హీరోయిన్ అన్న బ్రాండ్ నేమ్ ఉంది. సమంత హీరోయిన్ గా నటిస్తుందంటే ఆ సినిమా హిట్టేనని నిర్మాతల గట్టి నమ్మకం. సమంత కెరీర్ పరిశీలిస్తే ఇది నిజమే అనిపిస్తుంది. మొదటి చిత్రం ఏమాయ చేశావే మూవీతో మొదలైన ఆమె సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగుతుంది. సమంత నటించిన చిత్రాలలో చాలా వరకు విజయం సాధించాయి. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోతున్నా ఆమె క్రేజ్, స్టార్డం కొంచెం కూడా తగ్గలేదు. కొత్త ఫార్మాట్స్ లోకి కూడా అడుగుపెడుతూ సత్తా చాటుతున్నారు.

అదే సమయంలో సమంత వివాదాల బారినపడిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో కొన్ని చిన్న చిన్న పుకార్లు, వివాదాలు ఆమె ఎదుర్కొన్నారు. హీరో-హీరోయిన్ రెమ్యూనరేషన్స్ లో వ్యత్యాసంపై సమంత ఓపెన్ కామెంట్ చేశారు. అలాగే మహేష్ నేనొక్కడినే చిత్రంలో ఓ సాంగ్ స్త్రీల గౌరవాన్ని కించపరచేదిగా ఉందంటూ సమంత వ్యతిరేకత వ్యక్తం చేశారు. హీరో సిద్ధార్థతో ఆమె డేటింగ్ చేశారన్న పుకార్లు కూడా ఉన్నాయి.
అవన్నీ ఒకెత్తు అయితే 2021లో ఎదుర్కొన్న వివాదాలు మరొక ఎత్తు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఈ ఏడాది సమంతకు కలిసిరాలేదు. రెండు ప్రధానమైన వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. పర్సనల్ లైఫ్ డ్యామేజ్ కావడం జరిగింది. భర్త నాగ చైతన్యతో విడాకులు ఆమె జీవితంలో తలెత్తిన అతి పెద్ద వివాదం. ఈ న్యూస్ మీడియాను ఊపేసింది. దాదాపు నాలుగు నెలలు ఈ చర్చ మీడియాలో ప్రధానంగా నడిచింది.
సమంత చైతూతో అధికారికంగా విడాకులు ప్రకటించకుండానే వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రకటన అనంతరం మరిన్ని కథనాలు వీరి బ్రేకప్ పై వెలువడ్డాయి. సమంత- చైతూ డైవర్స్ ఎపిసోడ్ లో అందరూ సమంతను టార్గెట్ చేశారు. వివిధ కారణాలు తెరపైకి తెచ్చి, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని, అబార్షన్ చేయించుకున్నారని, అఫైర్స్ ఉన్నాయంటూ కథనాలు వెలువడ్డాయి.
Also Read: Tollywood: 2021 రౌండప్ : ఈ ఏడాది భారీ డిజాస్టర్స్ ఇవే !
విడాకుల వ్యవహారం ఆమె జీవితంలో జరిగిన అతిపెద్ద వివాదంగా మిగిలిపోయింది. ఆమెను మానసిక వేదనకు గురి చేసింది. ఈ ఏడాది సమంత ఎదుర్కొన్న మరొక వివాదం ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్. సమంత ఈ సిరీస్ లో ఇండియాపై దాడి చేయడానికి వచ్చిన తమిళ రెబల్ రోల్ చేశారు. సమంత రోల్ తమిళులను కించపరచేదిగా ఉందంటూ వ్యతిరేకత చెలరేగింది.
కోలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఈ సిరీస్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. సమంతపై తమిళులు దుమ్మెత్తి పోశారు.ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ విడుదల తర్వాత కూడా నిరసన జ్వాలలు ఆగలేదు.
Also Read: Tollywood: 2021 ఇయర్ రౌండప్ : టాలీవుడ్ కి ఊపు తెచ్చిన సినిమాలివే !