Sree Devi Drama Company: బుల్లి తెరలో ఎన్ని షోలు ఉన్నా.. ప్రేక్షకులు వినోదమైన కార్యక్రమాలకే మొగ్గు చూపుతారు. అలా ప్రేక్షకుల పల్స్ ని క్యాచ్ చేసుకుని బోలెడు ఎంటర్టైన్మెంట్ షోలు, రియాలిటీ షోలు ప్రసారమవుతున్నాయి. ఇంకా చెప్పాల్సిన పని లేదు.. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టే టీవీ చానల్స్ అన్ని ఎంటర్టైన్మెంట్ షో లతో కాలం వెలిబుచ్చుతున్నాయి . అంతే కాకుండా బుల్లితెరకి ఎంటర్టైన్మెంట్ షోల తోనే ఎక్కువ రేటింగ్ వస్తుంది.
ఈటీవీ షోలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోతూ మంచి ఎంటర్టైన్మెంట్ షో గా మారింది. ఇందులో బుల్లితెర పై ఒక వెలుగొందుతున్న స్టార్ సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఈ కార్యక్రమానికి సినీ నటి ఇంద్రజ జడ్జి గా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రతి వారం వారం బుల్లితెర,వెండి తెర సెలెబ్రిటీలను పిలిచి సందడి చేస్తున్నారు. అంతే కాకుండా రేటింగ్ పరంగా కూడా ఓ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుంది శ్రీ దేవి డ్రామా కంపెనీ.
అయితే ప్రతి వారం ఏదొక కాన్సెప్ట్ తీసుకుని ప్రేక్షకులని అలరింప చేస్తారు శ్రీ దేవి డ్రామా కంపెనీ బృందం. అయితే వచ్చేవారానికి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో ఇప్పుడు హడావిడి చేస్తుంది. అయితే అన్ని రకాల ఎమోషన్స్ ఈ ప్రోమో లో ఉన్నాయి. ఢీ కంటెస్టెంట్ రాజు వాళ్ళ అమ్మ కి బంగారం రింగ్ ని కానుకగా ఇచ్చాడు. అంతే కాకుండా ఆడవాళ్ళ ప్రాముఖ్యతని వివరిస్తూ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కావాలని చెప్పారు.
స్పెషల్ అట్రాక్షన్ – షణ్ముఖ ప్రియా: షణ్ముఖ ప్రియా ఈ మధ్య కలం లో మంచి పేరు సంపాదించుకుంది. ఇండియన్ ఐడల్ లో పాల్గొని ఫైనల్స్ వరకు వెళ్లింది. అంతే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది. అయితే వచ్చేవారం శ్రీ దేవి డ్రామా కంపెనీ లో తన గాత్రం తో అందరిని అలరించనుంది.
ఈ మధ్యనే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు. ఆయనికి ట్రిబ్యూట్ ఇస్తూ శ్రీ దేవి డ్రామా కంపెనీ ఒక చక్కటి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి చేత కంటతడి పెట్టిస్తారు.